GOVINDARAJA MUSES ON CHINNA SESHA _ చిన్నశేష వాహనంపై గోవిందుని రాజసం

Tirupati, 19 May 2021: The utsava idol of Sri Govindaraja Swamy graced on Chinna Sesha Vahanam on the second day morning of the ongoing annual brahmotsavams in Sri Govindaraja Swamy temple on Wednesday.

In view of the Covid pandemic, the vahana Seva was observed in Ekantam. Later Snapana Tirumanjanam was performed to the deities.

Both the senior and junior pontiffs of Tirumala, Special Grade DyEO Sri Rajendrudu and others were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

చిన్నశేష వాహనంపై గోవిందుని రాజసం

తిరుప‌తి, 2021 మే 19: శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన బుధ‌వారం ఉదయం శ్రీ స్వామివారు చిన్నశేష వాహనంపై అనుగ్రహించారు. కోవిడ్ -19 వ్యాప్తి నేప‌థ్యంలో ఆల‌యంలో ఏకాంతంగా వాహ‌న‌సేవ నిర్వ‌హించారు.

చిన్నశేష వాహనం స్వామివారి వ్యక్తరూపమైన పంచభౌతిక ప్రకృతికి సంకేతం. కనుక ఈ వాహనం పంచభూతాత్మకమైన విశ్వానికి, అందునివసించే జీవునికి వరాలిస్తుంది. విశ్వం కన్పించే శ్రీవారి ప్రకృతి. విష్ణువు ఈ ప్రకృతికి ఆధారమై దాన్ని నడిపించేశక్తి. స్వామి విశ్వాన్ని రక్షించేవాడు కనుక శేషునిపై తానొక్కడే విహరించాడు. పంచశిరస్సుల చిన్నశేషుని దర్శనం మహాశ్రేయఃప్రదం. శేషవాహనోత్సవాన్ని దర్శిస్తే దుష్టశక్తుల వల్ల కలిగే దుష్ఫలాలు తొలగి, భక్తులు కుండలినీయోగ సిద్ధించి, సుఖశాంతులతో ఆనందజీవులతారు.

స్నపన తిరుమంజనం –

ఉత్సవాల్లో రెండ‌వ రోజు కార్యక్రమాల్లో భాగంగా ఉదయం 9.30 నుండి 10.30 గంటల వరకు కల్యాణమండపంలో స్నపనతిరుమంజనం నిర్వ‌హించారు.ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనంల‌తో స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు విశేషంగా అభిషేకం చేశారు.

కాగా, సాయంత్రం 5.30 నుంచి 6 గంటల వర‌కు హంస వాహనంపై స్వామివారు కటాక్షించనున్నారు.

ఈ కార్యక్రమంలో శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, ఆలయ ప్ర‌త్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీ రాజేంద్రుడు, ఏఈవో శ్రీ ర‌వికుమార్‌‌ రెడ్డి, కంక‌ణ బ‌ట్టార్ శ్రీ ఏ.టి. పార్థ‌సార‌ధి దీక్షితులు, సూపరింటెండెంట్లు శ్రీ వెంక‌టాద్రి, శ్రీ కుమార్‌, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్లు శ్రీ మునీంద్ర‌బాబు, శ్రీ కామ‌రాజు, అర్చకులు, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.