EO INSPECTS WORKS OF CHILDREN’S HOSPITAL IN BIRRD _ చిన్న పిల్లల ఆసుపత్రి నిర్మాణం పనులు పరిశీలించిన ఈవో

Tirupati, 1 Apr. 21: TTD EO on Thursday inspected the works for Children’s Hospital in BIRRD hospital.

He inspected Reception, Registration, and Wards and observed the activities. He also verified the ongoing activities for setting up Children’s Hospital in old building of BIRRD.

He later inspected BIRRD new building blocks and examined OP block, Physiotherapy departments. He instructed the concerned to set up a Help Desk.

BIRRD Director Dr Madanmohan Reddy, CSRMO Sri Seshasailendra, CE Sri Ramesh Reddy, SEs Sri Jagadishwar Reddy, Sri Venlateswarulu were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI 

చిన్నపిల్లల ఆసుపత్రి నిర్మాణం పనులు పరిశీలించిన ఈవో

తిరుప‌తి, 2021, ఏప్రిల్ 01: బర్డ్ పాత బ్లాక్ లో  చిన్నపిల్లల ఆసుపత్రి తాత్కాలిక ఏర్పాటు కోసం జరుగుతున్న పనులను టిటిడి ఈవో డాక్టర్ కెఎస్‌.జ‌వహర్ రెడ్డి గురువారం పరిశీలించారు.

రిసెప్షన్, రిజిస్ట్రేషన్, వార్డులు, గదులు ఇతర నిర్మాణ పనులను చూశారు. త్వరితగతిన పనులు పూర్తి చేయాలని ఆదేశిస్తూ పలు సూచనలు చేశారు.

బర్డ్ ఆసుపత్రి రోగుల కోసం కొత్తగా నిర్మించిన గదులను పరిశీలించారు. డిజైన్ తో పాటు గదులు బాగున్నాయని చెప్పారు. అనంతరం బర్డ్ కొత్త బ్లాక్ భవనాలను పరిశీలించారు. ఓపి బ్లాక్, ఫిజియోథెరపీ విభాగం చూసి పలు సూచనలు చేశారు. కొత్తగా మంజూరు చేసిన ఎక్స్ రే మిషన్లు త్వరగా తెప్పించి  ఎక్స్ రే  కోసం రోగులు ఎక్కువ సమయం ఎదురు చూడకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రోగుల సహాయార్థం హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు చేయాలని ఈవో ఆదేశించారు.

బర్డ్ గౌరవ డైరెక్టర్ డాక్టర్ మదన్ మోహన్ రెడ్డి, సిఎస్ ఆర్ఎంఓ శ్రీ శేష శైలేంద్ర, సీఈ శ్రీ రమేష్ రెడ్డి, ఎస్ఈలు శ్రీ జగదీశ్వర్ రెడ్డి,  శ్రీ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.