Solar Eclipse on jan 26_ జనవరి 26వ తేదిన సూర్యగ్రహణం

Tirupati, 22 Jan 2009: The Solar Eclipse will fall from 2.20PM to 3.48PM on Jan 26. In view of this, the temple doors of Lord Venkateswara will be closed from 8.30AM to 4.30PM. All the Arjitha Sevas are also cancelled in the temple. Sarva Darshanam will start from 5.30PM on the same day.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

జనవరి 26వ తేదిన సూర్యగ్రహణం

తిరుమల, జనవరి-22, 2009: జనవరి 26వ తేదిన సూర్యగ్రహణం మధ్యాహ్నం 2.40 గంటల నుండి 3.50 గంటల వరకు సంభవిస్తుంది. ఈ సరదర్భంగా శ్రీవారి ఆలయాన్ని ఉదయం 8.30 గంటల నుండి సాయంత్రం 4.30 గంటల వరకు మూసి ఉంచుతారు. ఇదే రోజున శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఆర్జితసేవలన్నీ రద్దుచేశారు. శుద్ది,పుణ్యహవచనము నిర్వహించిన పిదప సర్వదర్శనం సాయంత్రం 5.30 గంటలకు ప్రారంభం అవుతుంది.  

తిరుమల తిరుపతి దేవస్థానముల దాస-సాహిత్య ప్రాజెక్ట్‌ ఆధ్వర్యంలో కర్నాటక సంగీత పితామహుడైన పురందర దాస ఆరాధనోత్సవాలు తిరుమల ఆస్థానమండపంనందు జనవరి 24 నుండి 27 వరకు నాలుగు రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు.

నారాయణగిరి ఉద్యానవనంలో నిర్వహించే ఈ ఉత్సవాలలో ప్రతిరోజు ఆధ్యాత్మిక ఉపన్యాసాలు, స్వామీజీల అనుగ్రహభాషణములు, సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. అదేవిధంగా జనవరి 26వ తేదిన సాయంత్రం 6 గంటలకు పద్మావతి పరిణయ మండపం వద్ద ఆస్థానం నిర్వహిస్తారు. ఇందుకై ఉభయ నాంచారులతో కూడిన శ్రీమలయప్ప స్వామివారు శ్రీవారి ఆలయం నుండి సాయంత్రం 6 గంటలకు ఊరేగింపుగా వెళ్ళి నారాయణగిరి ఉద్యానవనం చేరుకుంటారు. ఈ సందర్భంగా సంకీర్తనలు, సామూహిక భజనలు ఏర్పాటు చేస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.