జూన్‌13,14వ తేదీల్లో మ‌హాతి క‌ళాక్షేత్రంలో ”పాండురంగ మహత్యము” చిత్ర ప్ర‌ద‌ర్శ‌న‌

జూన్‌13,14వ తేదీల్లో మ‌హాతి క‌ళాక్షేత్రంలో  ”పాండురంగ మహత్యము” చిత్ర ప్ర‌ద‌ర్శ‌న‌

తిరుపతి, జూన్‌-13, 2008: శ్రీవారికి చిత్రహారతి కార్యక్రమంలో భాగంగా స్థానిక మహాతి ఆడిటోరియం నందు జూన్‌13,14వ తేదిలలో సాయంత్రం 6 గంటలకు ఎన్‌.టి.ఆర్‌, అంజలీదేవి తదితరులు నటించిన ”పాండురంగ మహత్యము” ఉచితంగా ప్రదర్శిస్తారు. ఈ చిత్రానికి శ్రీకమలాకర కామేశ్వరరావు దర్శకత్వం వహించారు.

కనుక పురప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరడమైనది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.