జూన్‌ 18 నుండి 26వ తేదీ వరకు అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు

జూన్‌ 18 నుండి 26వ తేదీ వరకు అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు

తిరుపతి, జూన్‌ 8, 2013: తిరుమల తిరుపతి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు జూన్‌ 18 నుండి 26వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. జూన్‌ 17వ తేదీ సాయంత్రం అంకురార్పణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.
తేదీ ఉదయం సాయంత్రం
18-06-13(మంగళవారం) ధ్వజారోహణం(సింహలగ్నం) పెద్దశేష వాహనం
19-06-13(బుధవారం) చిన్నశేష వాహనం హంస వాహనం
20-06-13(గురువారం) సింహ వాహనం ముత్యపుపందిరి వాహనం
21-06-13(శుక్రవారం) కల్పవృక్ష వాహనం   కల్యాణోత్సవం, సర్వభూపాల వాహనం
22-06-13(శనివారం) మోహినీ అవతారం గరుడ వాహనం
23-06-13(ఆదివారం) హనుమంత వాహనం గజ వాహనం
24-06-13(సోమవారం) సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం
25-06-13(మంగళవారం) రథోత్సవం అశ్వవాహనం
26-06-13(బుధవారం) చక్రస్నానం ధ్వజావరోహణం
బ్రహ్మోత్సవాల్లో ఉదయం 8.00 నుండి 9.00 గంటల వరకు, రాత్రి 8.00 నుండి 9.00 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి. జూన్‌ 21వ తేదీ సాయంత్రం 5.00 నుండి 7.30 గంటల వరకు స్వామివారి కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. రూ.500/- చెల్లించి గృహస్తులు(ఇద్దరు) ఈ కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డు, అన్నప్రసాదాలు బహుమానంగా అందజేస్తారు.

ఈ సందర్భంగా తితిదే హిందూ ధర్మప్రచార పరిషత్‌, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక, భక్తి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు, కోలాటాలు నిర్వహించ నున్నారు. అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో మధ్యాహ్నం 3.30 నుండి 5.30 గంటల వరకు సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.