TEPPOTSAVAMS IN SRI PAT _ జూన్ 20 నుండి 24వ తేదీ వరకు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆల‌యంలో ఏకాంతంగా తెప్పోత్సవాలు

Tirupati, 7 Jun. 21: The annual Teppotsavams in Sri Padmavathi Ammavari Temple Tiruchanoor will be observed from June 20 to 24 in Ekantam as per Covid guidelines.

Every day there will Snapana Tirumanjanam to Utsava idol of Ammavaru during these five days in Sri Krishna Mukha Mandapam between 2:30 pm and 4 pm.

TTD has cancelled Kalyanotsavam during these five days.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

జూన్ 20 నుండి 24వ తేదీ వరకు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆల‌యంలో ఏకాంతంగా తెప్పోత్సవాలు

తిరుప‌తి, 2021 జూన్ 07: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు జూన్ 20 నుండి 24వ తేదీ వరకు ఐదు రోజుల‌ పాటు ఆల‌య ప్రాంగణంలో ఏకాంతంగా జ‌రుగ‌నున్నాయి. కోవిడ్‌-19 నిబంధనలు అమల్లో ఉన్న నేపథ్యంలో ఉత్సవమూర్తుల‌ను పుష్కరిణి వరకు ఊరేగింపుగా తీసుకొచ్చే అవకాశం లేనందున ఆల‌య ప్రాంగణంలో ఏకాంతంగా అభిషేకం నిర్వహిస్తారు.

ఈ 5 రోజుల‌ పాటు ఆల‌యంలోని శ్రీ‌కృష్ణ ముఖ మండ‌పంలో మధ్యాహ్నం 2.30 నుండి 4 గంటల‌ వరకు ఉత్స‌వ‌మూర్తుల‌కు తిరుమంజ‌నం(అభిషేకం) చేపడతారు. జూన్ 20న శ్రీకృష్ణస్వామివారికి, జూన్ 21న శ్రీ సుందరరాజస్వామివారికి జూన్ 22 నుండి 24వ తేదీ వరకు శ్రీ పద్మావతి అమ్మవారి ఉత్సవమూర్తుకు అభిషేకం నిర్వహిస్తారు. తెప్పోత్స‌వాల కార‌ణంగా ఈ 5 రోజుల పాటు క‌ల్యాణోత్స‌వం ర‌ద్ద‌యింది.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.