జూన్ 21 నుండి 29వ తేది వరకు అప్పలాయగుంట శ్రీ ప్రసన్నవేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవములు

జూన్ 21 నుండి 29వ తేది వరకు అప్పలాయగుంట శ్రీ ప్రసన్నవేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవములు

తిరుపతి, 2010 జూన్ 12: అప్పలాయగుంటలో వెలసిన శ్రీ ప్రసన్నవేంకటేశ్వరస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవములు ఈనెల 21వ తేది నుంచి 29వ తేది వరకు అరగరంగ వైభవంగా జరుగుతాయి. 20వ తేదిన అంకురార్పణము నిర్వహిస్తారు.

ఈ బ్రహ్మోత్సవములలో శ్రీ స్వామివారు ప్రతి రోజు క్రింది వాహనాలను అధిరోహించి భక్తులకు కనువిందైన దర్శన భాగ్యం కల్పిస్తారు.

తేది ఉదయం       సాయంత్రం
21-06-2010 ధ్వజారోహణం (ఉ. 9.10 గంటలకు) పెద్దశేష వాహనం
22-06-2010 చిన్నశేష వాహనం హంసవాహనం
23-06-2010 సింహ వాహనం ముత్యపుపందిరి వాహనం
24-06-2010 కల్పవృక్ష వాహనం సర్వభూపాల వాహనం
25-06-2010 మోహిని అవతారం గరుడసేవ
26-06-2010 హనుమంత వాహనం గజవాహనం
27-06-2010 సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం
28-06-2010 రథోత్సవం (ఉ.4.30 గంటలకు) అశ్వ వాహనం
29-06-2010 చక్రస్నానం ధ్వజావరోహణం

ఈ బ్రహ్మోత్సవములలో 24వ తేది సాయంత్రం 5.30 నుండి 7.30 గంటల వరకు స్వామివారికి కల్యాణోత్సవం నిర్వహిస్తారు. ఇందులో పాల్గొనదలచిన భక్తులు రూ.300/- చెల్లించి దంపతులు పాల్గొన వచ్చును. వీరికి స్వామివారి వస్త్రం, తీర్థప్రసాదాలను అందజేస్తారు.

అదేవిధంగా ఈ ఉత్సవాల సందర్భంగా ప్రతి రోజు సాయంత్రం ఆలయ ప్రాంగణంలో సాంస్కృతిక కార్యక్రమాలు వుంటాయి.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.