NANDALUR ANNUAL FETE FROM JULY 14 TO 22 _ జూలై 14 నుండి 22వ తేదీ వరకు నందలూరు శ్రీ సౌమ్యనాథ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు

TIRUPATI, 02 JULY 2024: The annual brhamotsavams in Sri Soumyanatha Swamy temple in Nandalur of Annamaiah District will be held from July 14 to 22 with Ankurarpanam on July 13.

The annual fest commences with Dhwajarohanam in the auspicious Karkataka lagnam on July 14 from 7.45am to 8.15am and the following are the important vahana sevas including Garuda Vahanam on July 18, Arjita Kalyanam on July 20 at 10am, Rathotsavam on July 21, Chakrasnanam on July 20.

Grihastas can participate in Kalyanam on payment of Rs.500 per ticket on which two persons will be allowed.

Devotional Cultural progammes will be organised during all these days by the TTD projects.

ISSUED BY THE CHIEF PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

జూలై 14 నుండి 22వ తేదీ వరకు నందలూరు శ్రీ సౌమ్యనాథ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు

తిరుపతి, 2024 జూలై 02: అన్నమయ్య జిల్లా నందలూరు శ్రీ సౌమ్యనాథ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు జూలై 14 నుండి 22వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. బ్రహ్మోత్సవాలకు జూలై 13వ తేదీ అంకురార్పణ నిర్వహిస్తారు.

జూలై 14న ఉదయం 7.45 నుండి 8.15 గంటల వరకు కర్కాటక లగ్నంలో ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజు ఉదయం 8 గంటలకు, రాత్రి 7 గంటలకు వాహనసేవలు జరుగుతాయి.

వాహనసేవల వివరాలు :

తేదీ

14-07-2024

ఉదయం – ధ్వజారోహణం

రాత్రి – యాలి వాహనం

15-07-2024

ఉదయం – పల్లకీ సేవ

రాత్రి – హంస వాహనం

16-07-2024

ఉదయం – పల్లకీ సేవ

రాత్రి – సింహ వాహనం

17-07-2024

ఉదయం – పల్లకీ సేవ

రాత్రి – హనుమంత వాహనం

18-07-2024

ఉదయం – శేష వాహనం

రాత్రి – గరుడ వాహనం

19-07-2024

ఉదయం – సూర్యప్రభ వాహనం

రాత్రి – చంద్రప్రభ వాహనం

20-07-2024

ఉదయం – ఆర్జిత కల్యాణోత్సవం (ఉదయం 10 గంటలకు)

రాత్రి – గజ వాహనం

21-07-2024

ఉదయం – రథోత్సవం (ఉదయం 9 గంటలకు)

రాత్రి – అశ్వవాహనం

22-07-2024

ఉదయం – చక్రస్నానం

రాత్రి – ధ్వజావరోహణం

జూలై 20వ తేదీ ఉదయం 10 గంటలకు ఆర్జిత కల్యాణోత్సవం జరుగనుంది. గృహస్తులు(ఇద్దరు) రూ.500/- చెల్లించి ఈ కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, అన్నప్రసాదాలు బహుమానంగా అందజేస్తారు. జూలై 23న సాయంత్రం 6 గంటలకు పుష్పయాగం నిర్వహించనున్నారు.

ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్ట్, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక, భక్తి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.