జూలై 18 నుండి  తాళ్లపాకలోని శ్రీ చెన్నకేశవస్వామి, శ్రీ సిద్దేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు

జూలై 18 నుండి  తాళ్లపాకలోని శ్రీ చెన్నకేశవస్వామి, శ్రీ సిద్దేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు

తిరుపతి, జూలై 08, 2013: తిరుమల తిరుపతి దేవస్థానములకు అనుబంధంగా ఉన్న వైఎస్‌ఆర్‌ జిల్లా తాళ్లపాకలో గల శ్రీ చెన్నకేశవస్వామి, శ్రీ సిద్ధేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు జూలై 18 నుండి 28వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి.
శ్రీ చెన్నకేశవస్వామివారి వాహనసేవలు:

జూలై 18న అంకురార్పణ, జూలై 19న ఉదయం 7.15 గంటలకు ధ్వజారోహణం, రాత్రి చిన్నశేషవాహన సేవలు నిర్వహిస్తారు. జూలై 20న ఉదయం పల్లకీ సేవ, రాత్రి హంస వాహనం, జూలై 21న ఉదయం పల్లకీ ఉత్సవం, రాత్రి సింహ వాహనం, జూలై 22న ఉదయం పల్లకీ ఉత్సవం, రాత్రి హనుమంత వాహనాలపై స్వామివారు భక్తులకు కనువిందు చేయనున్నారు. జూలై 23న ఉదయం మోహినీఅవతారం, రాత్రి 7.00 గంటలకు శిఖరదీపారాధనం, రాత్రి 9.00 గంటలకు గరుడ వాహన సేవ నిర్వహిస్తారు. జూలై 24న సాయంత్రం 5.30 గంటలకు ఆర్జిత కల్యాణోత్సవం జరుగనుంది. గృహస్తులు రూ.300/- చెల్లించి ఈ కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డూ, ఒక వడ, అన్నప్రసాదం బహుమానంగా అందజేస్తారు. ఆ తరువాత రాత్రి 9.00 గంటలకు గజ వాహనంపై స్వామివారు విహరించనున్నారు. జూలై 25న సాయంత్రం 6.30 గంటలకు రథోత్సవం, జూలై 26న రాత్రి అశ్వవాహనం, జూలై 27న ఉదయం 8.30 గంటలకు వసంతోత్సవం, ఉదయం 10.30 గంటలకు చక్రస్నానం, సాయంత్రం 6.45 గంటలకు ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.
శ్రీ సిద్దేశ్వరస్వామివారి వాహనసేవలు:

జూలై 18న అంకురార్పణ, జూలై 19న ఉదయం 7.00 గంటలకు ధ్వజారోహణం, రాత్రి హంసవాహన సేవలు నిర్వహిస్తారు. జూలై 20న ఉదయం పల్లకీ సేవ, రాత్రి చంద్రప్రభ వాహనం, జూలై 21న ఉదయం పల్లకీ ఉత్సవం, రాత్రి చిన్నశేష వాహనం, జూలై 22న ఉదయం పల్లకీ ఉత్సవం, రాత్రి సింహ వాహనాలపై స్వామివారు భక్తులకు కనువిందు చేయనున్నారు. జూలై 23న ఉదయం పల్లకీ సేవ, రాత్రి 6.00 గంటలకు శిఖరదీపారాధనం, సాయంత్రం 6.30 గంటలకు నంది వాహన సేవ నిర్వహిస్తారు. జూలై 24న సాయంత్రం 5.30 గంటలకు ఆర్జిత కల్యాణోత్సవం జరుగనుంది. గృహస్తులు రూ.300/- చెల్లించి ఈ కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డూ, ఒక వడ, అన్నప్రసాదం బహుమానంగా అందజేస్తారు. ఆ తరువాత రాత్రి 7.30 గంటలకు గజ వాహనంపై స్వామివారు విహరించనున్నారు. జూలై 25న సాయంత్రం పల్లకీ సేవ, జూలై 26న రాత్రి పార్వేటి ఉత్సవం, జూలై 27న ఉదయం 8.30 గంటలకు వసంతోత్సవం, ఉదయం 10.30 గంటలకు త్రిశూలస్నానం, సాయంత్రం 6.30 గంటలకు ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.

జూలై 28వ తేదీన ఉదయం 9.30 గంటలకు శ్రీ చెన్నకేశవస్వామి, శ్రీ సిద్దేశ్వరస్వామివార్ల  ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం, హోమం నిర్వహించనున్నారు. అదేరోజు సాయంత్రం 6.30 గంటలకు పుష్పయాగం ఘనంగా జరుగనుంది.

బ్రహ్మోత్సవాల్లో భాగంగా తితిదే హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతిరోజూ హరికథలు, ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.    

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.