SUNDARARAJA SWAMY AVATAROTSAVAMS _ జూలై 7 నుండి 9వ తేదీ వరకుశ్రీ సుందరరాజ స్వామి వార్షిక అవతార మహోత్సవాలు 

TIRUPATI, 05 JULY 2023: The annual Avatarotsavams of Sri Sundararaja Swamy will be observed between July 7 to 9 in Tiruchanoor.

Abhishekam will be performed to the utsava deities in Sri Krishna Mukha Mandapam on all these days between 2pm and 3:30pm.

Later in the evening Unjal Seva and Vahana Sevas will be observed.

TTD has cancelled Unjal Seva on the occasion.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDS, TIRUPATI

జూలై 7 నుండి 9వ తేదీ వరకుశ్రీ సుందరరాజ స్వామి వార్షిక అవతార మహోత్సవాలు

తిరుపతి, 2023, జూలై 05: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీసుందరరాజస్వామివారి అవతార మహోత్సవాలు జూలై 7 నుండి 9వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి.

ఈ మూడు రోజుల పాటు మధ్యాహ్నం 2 నుండి 3.30 గంటల వరకు శ్రీ కృష్ణస్వామి ముఖ మండపంలో శ్రీ సుందరరాజ స్వామివారికి వైభవంగా అభిషేకం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఉత్సవర్లకు పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంతో విశేషంగా అభిషేకం చేస్తారు. అనంతరం సాయంత్రం 5.30 నుండి 6.15 గంటల
వరకు శ్రీ సుందరరాజస్వామివారికి ఊంజల్‌ సేవ జరుగుతుంది. రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు వాహన సేవ నిర్వహిస్తారు.

శ్రీసుందరరాజస్వామివారు మొదటి రోజు పెద్దశేష వాహనం, రెండో రోజు హనుమంత వాహనం, చివరిరోజు గరుడ వాహనంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు.

ఈ ఉత్సవాల సందర్భంగా మూడు రోజుల పాటు శ్రీ పద్మావతి అమ్మవారి ఊంజ‌ల్ సేవను టీటీడీ రద్దు చేసింది.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.