JEO INSPECTS TTD EMPLOYEES SPORTS _ టిటిడి ఉద్యోగుల క్రీడ‌ల‌ను ప‌రిశీలించిన జెఈవో శ్రీ‌మ‌తి స‌దా భార్గ‌వి

Tirupati, 6 Mar. 21: TTD Joint Executive Officer Smt Sada Bhargavi on Saturday inspected the ongoing TTD employees annual sports meet and called upon all the enthuse participants to display sportive spirit.

In the ball badminton event for Men’s singles category, Sri K Ramurthy Reddy emerged winner over Sri D Gopalakrishnamurthy.

In the Doubles Ball Badminton event for Ex service Women category P Sumati and B Lalithamma team were winners and M Pushpa Kumari and Nirmala Krishna team stood runner up.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

టిటిడి ఉద్యోగుల క్రీడ‌ల‌ను ప‌రిశీలించిన జెఈవో శ్రీ‌మ‌తి స‌దా భార్గ‌వి

 తిరుపతి, 2021 మార్చి 06: తిరుప‌తిలోని ఎస్వీ హైస్కూల్ క్రీడామైదానంలో జ‌రుగుతున్న టిటిడి ఉద్యోగుల క్రీడలను శ‌నివారం జెఈవో శ్రీమ‌తి స‌దా భార్గ‌వి ప‌రిశీలించారు. క్రీడాంశాలు, అందుకు క‌ల్పించిన వ‌స‌తుల‌ను ఉద్యోగుల‌ను అడిగి తెలుసుకున్నారు. ఉద్యోగులు క్రీడాస్ఫూర్తితో ఆట‌లు ఆడాల‌ని కోరారు. శ‌నివారం జ‌రిగిన క్రీడ‌ల్లో విజేతలుగా నిలిచిన వారి వివ‌రాలు ఇలా ఉన్నాయి.

బాల్ బ్యాడ్మింట‌న్‌..

–   విశ్రాంత పురుష ఉద్యోగుల సింగిల్స్ పోటీలలో శ్రీ కె.రామ్మూర్తి రెడ్డి విజయం సాధించగా, శ్రీ డి.గోపాల‌కృష్ణ‌మూర్తి రన్నరప్‌గా నిలిచారు.

– విశ్రాంత మ‌హిళా ఉద్యోగుల డబుల్స్ పోటీలలో శ్రీమతి పి.సుమ‌తి, శ్రీ‌మ‌తి బి.ల‌లిత‌మ్మ జట్టు విజయం సాధించగా, శ్రీమతి ఎం.పుష్ప‌కుమారి, శ్రీమతి నిర్మ‌ల‌కృష్ణ‌ జట్టు రన్నరప్‌గా నిలిచింది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.