GURUVAYURAPPAN DEVASTHANAMS TEAM TO STUDY TTD PILGRIM INITIATIVES _ టిటిడి పాల‌న‌పై శ్రీ గురువాయుర‌ప్ప‌న్ దేవ‌స్థానం బోర్డు అధ్య‌య‌నం

Tirupati, 24 Dec. 19: Sri Guruvayurappan Temple at Trichur of Kerala is keen to study the various schemes, administration, security, and traditions that are being practised in the Srivari Temple in the most effective manner since decades.

A study team led by the Trishur temple board Chairman Sri K B Mohandas called on the Joint Executive Officer Sri P Basant Kumar at the later’s chambers in TTD administrative building in Tirupati on Tuesday.

The JEO made a power point presentation (PPP) to highlight the Queue line management in Srivari temple, Anna Prasadam, cleanliness, Security, IT and Finance administration, Dharma Pracharam, Projects, and Srivari Seva.

TTD board special invitee Sri Govind Hari, Dr. Ramanathan of Trichur and others participated.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

 

టిటిడి పాల‌న‌పై శ్రీ గురువాయుర‌ప్ప‌న్ దేవ‌స్థానం బోర్డు అధ్య‌య‌నం

తిరుపతి, 2019 డిసెంబ‌రు 24: ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత ధార్మిక క్షేత్ర‌మైన తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌య నిర్వ‌హ‌ణ‌, టిటిడి పాల‌న‌పై కేర‌ళ రాష్ట్రం త్రిశూర్‌లోని ప్ర‌ముఖ క్షేత్ర‌మైన‌ శ్రీ గురువాయుర‌ప్ప‌న్ దేవ‌స్థానం బోర్డు అధ్య‌య‌నం చేప‌ట్టింది. ఈ మేర‌కు బోర్డు ఛైర్మ‌న్ శ్రీ కెబి.మోహ‌న్‌దాస్ మంగ‌ళ‌వారం తిరుప‌తిలోని టిటిడి ప‌రిపాల‌నా భ‌వ‌నంలో జెఈవో శ్రీ పి.బ‌సంత్‌కుమార్‌ను క‌లిశారు.

ఈ సంద‌ర్భంగా జెఈవో ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జంటేష‌న్ ద్వారా టిటిడి కార్య‌క‌లాపాల‌ను వివ‌రించారు. శ్రీ‌వారి ఆల‌యం, క్యూలైన్ల‌ నిర్వ‌హ‌ణ‌, అన్న‌ప్ర‌సాద విత‌ర‌ణ‌, ప‌రిశుభ్ర‌త‌, భ‌ద్ర‌త‌, ఆర్థిక విభాగం, ధ‌ర్మ‌ప్ర‌చారం, ప్రాజెక్టులు, స్థానికాల‌యాలు, శ్రీ‌వారిసేవ‌, ర‌వాణా త‌దిత‌ర విభాగాల్లో టిటిడి అనుస‌రిస్తున్న విధానాల‌ను తెలియ‌జేశారు.

ఈ కార్యక్రమంలో టిటిడి బోర్డు ప్ర‌త్యేక ఆహ్వానితులు శ్రీ గోవింద‌హ‌రి, త్రిశూర్‌కు చెందిన డా. రామ‌నాథ‌న్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.