DARSHAN RESUMES IN ALL LOCAL TEMPLES _ టిటిడి స్థానిక ఆలయాల్లో దర్శనం పునఃప్రారంభం

Tirupati, 26 Dec. 19: The darshan resumed for devotees in all the TTD sub temples located in and around Tirupati on Thursday after being closed for over 15 hours following solar eclipse on Thursday.

All the TTD temples including Sri Padmavati Ammavari temple at Tiruchanoor, Sri Govindaraja Swamy temple and Sri Kodandarama Swamy temple at Tirupati, Sri Kalyana Venkateswara Swamy temple at Srinivasa Mangapuram and Sri Prasanna Venkateswara Swamy temple at Appalayagunta were closed after ekantha seva rituals of the respective temples on Wednesday night.

After the completion of solar eclipse between 8:08am and 11:16am on Thursday, all the temples were re opened and Suddhi was performed as per the tenets of Agama Shastra. 

At Tiruchanoor, the darshan for devotees resumed at 3:15pm while at Sri Govindaraja swamy temple and Sri Kodandarama Swamy temple by 2pm,  Srinivasa Mangapuram by 3.30pm and at Appalayagunta by 2pm. 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

టిటిడి స్థానిక ఆలయాల్లో దర్శనం పునఃప్రారంభం

తిరుపతి, 2019 డిసెంబ‌రు 26: టిటిడికి అనుబంధంగా ఉన్న ఆలయాల్లో గురువారం మ‌ధ్యాహ్నం నుండి భక్తులను దర్శనానికి అనుమతించారు. డిసెంబ‌రు 26వ తేదీన సూర్య‌గ్రహణం సందర్భంగా టిటిడి స్థానికాలయాలను బుధ‌వారం రాత్రి మూసివేసిన విషయం విదితమే.

తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయాన్ని గురువారం మ‌ధ్యాహ్నం 12.00 గంటలకు   తెరిచి శుద్ధి, పుణ్యహవచనం చేశారు. అనంతరం 2.00 గంటలకు సర్వదర్శనానికి భక్తులను అనుమతించారు.

తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయాన్ని గురువారం మ‌ధ్యాహ్నం 12.00 గంటలకు తెర‌చి శుద్ధి, పుణ్యహవచనం నిర్వహించారు. ఆ తర్వాత మ‌ధ్యాహ్నం 2.00 గంట‌ల నుండి భక్తులకు సర్వదర్శనం కల్పించారు.
 
తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయాన్ని మ‌ధ్యాహ్నం 12.00 గంటలకు తెర‌చి శుద్ధి, పుణ్యహవచనం చేపట్టారు. మ‌ధ్యాహ్నం 2.00 గంట‌ల నుండి భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.  

తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయాన్ని మ‌ధ్యాహ్నం 12.00 గంటలకు తెరిచి శుద్ధి అనంతరం మ‌ధ్యాహ్నం 2.00 గంట‌ల నుండి భక్తులకు సర్వదర్శనం కల్పించారు.
 
శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయాన్ని గురువారం మ‌ధ్యాహ్నం 12.00 గంటలకు తెర‌చి శుద్ధి పుణ్యహవచనం నిర్వ‌హించారు. అనంతరం మ‌ధ్యాహ్నం 3.30 గంటల నుండి భక్తులకు సర్వదర్శనం కల్పించారు.
 
చంద్రగిరిలోని శ్రీ కోదండరామాలయాన్ని గురువారం 4.00 గంటలకు తెర‌చి శుద్ధి, పుణ్యహవచనం నిర్వహించారు. శుద్ధి తరువాత భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.
 
అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్నవేంకటేశ్వరస్వామివారి ఆలయాన్ని మ‌ధ్యాహ్నం 12.00 గంటలకు తెరిచి శుద్ధి, పుణ్యహవచనం నిర్వహించారు. మ‌ధ్యాహ్నం 2.00 గంట‌ల నుండి సర్వదర్శనానికి భక్తులను అనుమతించారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.