TTD MANUAL ON DISASTER MANAGEMENT SOON-JEO (H&E) _ టీటీడీలో విపత్తుల నిర్వహణపై త్వరలో మాన్యువల్ ముద్రణ

Tirupati,12 July 2023: TTD JEO for Health and Education Smt Sada Bhargavi said on Wednesday that a compact manual for maintenance and tackling of calamities like landslides, fire accidents etc. will soon be compiled.

 

Addressing a disaster management training session for TTD HODs organised at the SVETA Bhavan, the JEO said last year’s torrential rainfalls caused landslides on ghat roads and led to huge losses besides disruptions.

 

In this background, TTD has prepared an action plan for disaster management on the lines of state disaster management plans.

 

In collaboration with the UNICEF TTD has compiled a manual for action plan with predefined roles for all departments.

 

She said the compilation of the manual is at final stage and will soon be published.

The state-level Disaster Management representative Sri Nagraj, UNICEF representative

 

Sri Amal Krishna, HODs of several TTD departments were present.

 

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

టీటీడీలో విపత్తుల నిర్వహణపై త్వరలో మాన్యువల్ ముద్రణ

తిరుపతి, 2023, జూలై 12: ప్రకృతి విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అనుసరించాల్సిన విధి విధానాలతో త్వరలో మాన్యువల్ ముద్రిస్తామని టీటీడీ జేఈవో శ్రీమతి సదా భార్గవి తెలిపారు. తిరుపతిలోని శ్వేత భవనంలో టీటీడీ లోని వివిధ విభాగాధిపతులు బుధవారం డిజాస్టర్ మేనేజ్మెంట్ పై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు.

ముఖ్య అథితి గా హాజరైన జేఈవో మాట్లాడుతూ, గతంలో భారీ వర్షాల కారణంగా తిరుమల ఘాట్ రోడ్లలో బండరాళ్లు విరిగిపడి తీవ్రనష్టం వాటిల్లిందన్నారు.
ఈ నేపథ్యంలో విపత్తుల నివారణకు చర్యలు చేపట్టాలని టీటీడీ నిర్ణయించిందని తెలిపారు రాష్ట్ర డిజాస్టర్ మేనేజ్మెంట్ తరహాలో టీటీడీలోను ప్లాన్ రూపొందించేందుకు చర్యలు ప్రారంభించామన్నారు. ఇందుకోసం యూనిసెఫ్ సంస్థతో కలిసి మాన్యువల్ రూపకల్పన చేశామన్నారు. టీటీడీలోని అన్ని విభాగాలు ఇందులో భాగస్వాములయ్యాయని చెప్పారు.మాన్యువల్ తుదిదశకు చేరుకుందని, త్వరలో విడుదల చేస్తామని వెల్లడించారు.

ఈ సమీక్షలో స్టేట్ లెవెల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రతినిధి శ్రీ నాగరాజు, యూనిసెఫ్ సంస్థ ప్రతినిధి శ్రీ అమల్ కృష్ణ, టీటీడీలోని వివిధ విభాగాధిపతులు పాల్గొన్నారు.

అర్చక శిక్షణను పరిశీలించిన జేఈవో

అంతకుముందు జేఈవో శ్రీమతి సదా భార్గవి శ్వేత భవనంలో ఎస్సీ, ఎస్టీ, మత్స్యకార వర్గాల వారికి జరుగుతున్న అర్చక శిక్షణ కార్యక్రమాన్ని పరిశీలించారు. వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన అర్చకులతో ముచ్చటించారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.