TTD EO TAKES OATH AS EX-OFFICIO _ టీటీడీ ఎక్స్ అఫిషియో స‌భ్యునిగా టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి ప్రమాణస్వీకారం

TIRUPATI, 01 SEPTEMBER 2023: TTD EO Sri AV Dharma Reddy took oath as an ex-officio member of the TTD Trust Board at Srivari Temple in Tirumala on Friday. 

 

Smt Sada Bhargavi, JEO(H&E) administered the oath.  After darshan, Vedasirvachanam held in Ranganayakula Mandapam. 

 

Later JEO presented Srivari Tirtha Prasadams and laminated photo of Srivaru to the EO.

 

Deputy EOs Sri. Lokanatham, Sri. Govindarajan and others were also present.

 
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

టీటీడీ ఎక్స్ అఫిషియో స‌భ్యునిగా ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి ప్రమాణస్వీకారం

తిరుమల, 2023 సెప్టెంబర్ 01: టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి శుక్ర‌వారం తిరుమ‌ల‌ శ్రీవారి ఆలయంలో టీటీడీ బోర్డు ఎక్స్-అఫిషియో సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేశారు. శ్రీ‌వారి ఆల‌యంలోని బంగారు వాకిలి చెంత జేఈవో శ్రీమ‌తి స‌దా భార్గ‌వి వీరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈవో శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. అనంత‌రం జేఈవో శ్రీ‌వారి తీర్థ ప్ర‌సాదాలు, చిత్ర‌ప‌టాన్ని అందించారు.

ఈ కార్య‌క్ర‌మంలో డెప్యూటీ ఈవోలు శ్రీ లోక‌నాథం, శ్రీ గోవింద‌రాజ‌న్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.