SOME IMPORTANT RESOLUTIONS IN TTD BOARD MEETING _ టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో ముఖ్య నిర్ణయాలు 

TIRUMALA, 19 JUNE 2023: TTD Board under the Chairmanship of Sri YV Subba Reddy along with the TTD EO Sri AV Dharma Reddy and other members have taken some important decisions during the Trust Board meeting held at Annamaiah Bhavan in Tirumala on Monday.   

Some Excerpts: To enhance the standards of Sri Venkateswara Institute of Medical Sciences(SVIMS) the board has given nod to construct a Cardio-Neuro block at Rs.97cr besides constructing a Centralized kitchen at Rs.7cr and a Centralized Godown at Rs.7.75cr.

Given nod for allocating FMS services West Package in Tirumala to Mumbai-based Facility and Property Managers Pvt. Ltd. For three years between 2023-26 at Rs. 40.50cr and FMS services for Seva Sadan twin buildings, Vakulamata Rest House, PAC 3,4 B type and D type quarters to the same firm for the same period at Rs. 29.50cr

Approved towards the construction of the Centralized Record Store at Rs. 9.50cr and Rs.4.15cr towards the construction of Additional Laddu Counters 

Approved to sanction Rs.7.44cr towards the purchase of computers for the utility of various departments and Rs. 5cr towards the construction of staff quarters in the premises of SV Vedic University in the varsity premises

Given nod to sanction Rs.6.65cr towards erecting Brass Grills to the Pushkarini at Tiruchanoor

Approved the construction of BT road from Ramanuja Circle in Tirupati to Renigunta at Rs.5.61cr

Green signal to construct Annaprasadam Complex at Vontimitta on donation basis at Rs.4cr

Given nod towards the construction of four Raja Gopurams to Sri Padmavathi Goda Devi sameta Sri Kalyana Venkateswara Swamy temple in Seetaramapuram village of Avuku mandal in Kurnool district at Rs. 4.15cr

Given nod to develop Police Quarters at Rs. 3.55cr and setting up of stainless steel dust bins at Rs. 3.10cr

Sanctioned Rs.2.35cr towards the improvements of 18blocks(total 144) of cottages in the HVC area and for Improvements in GNC, HVC, ANC, SNC sub-enquiry offices at Rs. 1.88cr

Approved the construction of TTD Kalyana Mandapam at Yaganti at Rs.2.45cr and near Bugga in Nagari at Rs. 2cr

Given nod towards the printing of 2024 TTD Diaries, Calendars, printing papers etc.

OTHERS

Action plan underway to construct Srivari temples at Gujarat and Chattisgarh

Advanced scanners for Alipiri to identify prohibited items in an easy manner

Board members, TTD top brass officials also participated.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో ముఖ్య నిర్ణయాలు

తిరుమల, 2023 జూన్‌ 19: టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం సోమవారం తిరుమల అన్నమయ్య భవనంలో ఛైర్మన్‌ శ్రీ వైవి.సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగింది. ఇందులో తీసుకున్న ప్రధాన నిర్ణయాలను ఛైర్మన్‌ మీడియాకు వెల్లడించారు . వివరాలు ఇవి.

– రూ.4.15 కోట్లతో తిరుమలలో అదనపు లడ్డూ కౌంటర్ల నిర్మాణానికి టెండర్ల ఆమోదం.

– రూ.2.35 కోట్లతో తిరుమల హెచ్‌విసి ప్రాంతంలోని 18 బ్లాకుల్లో గల 144 గదుల అభివృద్ధి పనులు చేపట్టేందుకు ఆమోదం.

– రూ.1.88 కోట్లతో జిఎన్‌సి, హెచ్‌విసి, ఏఎన్‌సి, ఎస్‌ఎన్‌సి ఉప విచారణ కార్యాలయాల ఆధునీకరణ, అభివృద్ధి పనులకు ఆమోదం.

– రూ.40.50 కోట్లతో తిరుమలలో వెస్ట్‌ ప్యాకేజికి గాను మూడు సంవత్సరాల కాలపరిమితికి ఎఫ్‌ఎంఎస్‌ సేవలను ముంబయికి చెందిన ఫెసిలిటీ అండ్‌ ప్రాపర్టీ మేనేజర్స్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌ సంస్థకు అందించేందుకు టెండర్లు ఆమోదం.

– అదేవిధంగా, రూ.29.50 కోట్లతో శ్రీవారి సేవాసదన్‌, వకుళామాత విశ్రాంతి గృహం, పిఏసి`3, 4, బి టైప్‌, డి టైప్‌ క్వార్టర్స్‌ ప్రాంతాల్లో ఎఫ్‌ఎంఎస్‌ సేవలను అదే సంస్థకు అప్పగించేందుకు టెండర్లు ఆమోదం.

– రూ.3.55 కోట్లతో తిరుమలలో పోలీస్‌ క్వార్టర్స్‌ అభివృద్ధికి పరిపాలన అనుమతి ఇవ్వడం జరిగింది.

– రూ.3.10 కోట్లతో తిరుమలలో వివిధ ప్రాంతాల్లో స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ చెత్తకుండీల ఏర్పాటుకు పరిపాలన అనుమతి.

– రూ.5 కోట్లతో తిరుపతిలోని ఎస్వీ వేద వర్సిటీ ప్రాంగణంలో స్టాఫ్‌ క్వార్టర్స్‌ నిర్మాణానికి ఆమోదం.

– రూ.7.44 కోట్లతో టీటీడీలోని వివిధ విభాగాల అవసరాల కోసం వర్క్‌లోడ్‌ ప్రకారం కంప్యూటర్లు కొనుగోలుకు నిర్ణయం.

– రూ.9.50 కోట్లతో టీటీడీ పరిపాలన భవనంలో సెంట్రలైజ్డ్‌ రికార్డు స్టోర్‌ నిర్మాణానికి పరిపాలన అనుమతి ఇవ్వడం జరిగింది.

– 2024 సంవత్సరానికి గాను క్యాలెండర్లు, డైరీల ముద్రణకు నిర్ణయం.

– రూ.2 కోట్లతో నగరి సమీపంలోని బుగ్గలో శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీకాశీవిశ్వేశ్వరస్వామివారి ఆలయం వద్ద కల్యాణ మండపం నిర్మాణానికి ఆమోదం.

– రూ.4.15 కోట్ల శ్రీవాణి నిధులతో కర్నూలు జిల్లా, అవుకు మండలం, సీతారామపురం గ్రామంలోని శ్రీ పద్మావతి, గోదాదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారి ఆలయానికి 4 రాజగోపురాల నిర్మాణానికి టెండర్లు ఆమోదం.

– స్విమ్స్‌ ఆసుపత్రిని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి మరింత మెరుగైన వైద్యసేవలందించేందుకు రూ.97 కోట్లతో కార్డియో న్యూరో బ్లాక్‌, రూ.7 కోట్లతో సెంట్రలైజ్డ్‌ వంటశాల, రూ.7.75 కోట్లతో సెంట్రలైజ్డ్‌ గోడౌన్‌ నిర్మాణానికి టెండర్లు ఆమోదం.

– రూ.4 కోట్ల దాతల విరాళంతో ఒంటిమిట్టలో అన్నప్రసాద భవనం భవనం నిర్మాణానికి ఆమోదం.

– రూ.6.65 కోట్లతో తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి పుష్కరిణికి ఇత్తడిగ్రిల్స్‌ అమర్చడానికి టెండర్లు ఆమోదం.

– రూ.5.61 కోట్లతో తిరుపతిలోని రామానుజ సర్కిల్‌ నుండి రేణిగుంట వరకు బిటి రోడ్డు నిర్మాణానికి టెండర్లు ఆమోదం.

– నంద్యాల జిల్లా యాగంటిలో రూ.2.40 లక్షలతో టీటీడీ కల్యాణ మండపం నిర్మిస్తాం.

– ధర్మప్రచారంలో భాగంగా జమ్మూలో 24 నెలల వ్యవధిలో శ్రీవారి ఆలయం నిర్మించి, ఈ నెల 8వ తేదీన మహాసంప్రోక్షణ నిర్వహించి భక్తులకు దర్శనం కల్పిస్తున్నాం.

– మే నెలలో ఏజన్సీ ప్రాంతాలైన సీతంపేట, రంపచోడవరంలో శ్రీవారి ఆలయాలకు మహాసంప్రోక్షణ నిర్వహించి భక్తులకు దర్శనం కల్పిస్తున్నాం. ఈ ఆలయాల వద్ద కల్యాణమండపాలు నిర్మించి గిరిజనులు ఉచితంగా వివాహాలు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తాం.

– తెలంగాణలోని కరీంనగర్‌లో ఇటీవల శ్రీవారి ఆలయ నిర్మాణానికి భూమిపూజ చేశాం. అదేవిధంగా, సిద్ధిపేటలో 6 ఎకరాల స్థలం కేటాయిస్తామని శ్రీవారి ఆలయం నిర్మించాలని ముఖ్యమంత్రివర్యులు
శ్రీ చంద్రశేఖర్‌రావు ఎపి ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డికి లేఖ రాశారు. ముఖ్యమంత్రివర్యుల ఆదేశాల మేరకు అక్కడ స్వామివారి ఆలయం నిర్మిస్తాం.

– త్వరలో గుజరాత్‌లోని గాంధీనగర్‌లో, ఛత్తీస్‌ఘడ్‌ రాజధాని రాయ్‌పూర్‌లో శ్రీవారి ఆలయాలు నిర్మించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నాం.

– తిరుమలకు నిషేధిత పదార్థాలు తీసుకురాకుండా అలిపిరి చెక్‌పాయింట్‌ వద్ద పటిష్టంగా తనిఖీలు చేపడుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించి నిషేధిత పదార్థాలను గుర్తించేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం గల వెహికల్‌ స్కానర్లను కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం.

ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి, బోర్డు సభ్యులు శ్రీ భూమన కరుణాకర్‌రెడ్డి, డా. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, శ్రీ పోకల అశోక్‌కుమార్‌, శ్రీ మూరంశెట్టి రాములు, శ్రీ మారుతిప్రసాద్‌, శ్రీ మధుసూదన్‌ యాదవ్‌, శ్రీ పార్థసారథి, జెఈవోలు శ్రీమతి సదా భార్గవి, శ్రీ వీరబ్రహ్మం, సివిఎస్వో శ్రీ నరసింహ కిషోర్‌ తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.