PRANAYA KALAHA MAHOTSAVAM ON DECEMBER 28 _ డిసెంబరు 28న శ్రీవారి ప్రణయకలహ మ‌హోత్సవం

Tirumala, 27 December 2023: The unique festival, Pranaya Kalaha Mahotsavam in which Sri Venkateswara Swamy along with His two consorts participates in an interesting ”Love Game” will be held in Tirumala on December 28.

 

Commemorating this festival, the Utsava murthies of Swami and Ammavarlu will leave the Vaibhavotsava mandapam separately on golden palanquins and face each other opposite Sri Varahaswamy temple. 

 

Here the priests divide into two with one set taking the side of Srivaru and other supporting the divine consorts.

 

They render Pasuras of the Alwar Divyaprabandha separately on behalf of the Swami and the Ammavarlu on the occasion written in Nindastuti style. After that, the divine consorts, after taunting the Swami, throw flower balls at each other and the Swami escapes from the flowers shots.

 

The entire episode provides a visual treat and entertainment to the devotees witnessing the festival. Later the deities return to the temple.

 

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

డిసెంబరు 28న శ్రీవారి ప్రణయకలహ మ‌హోత్సవం

తిరుమల, 2023 డిసెంబ‌రు 27: శ్రీ వేంకటేశ్వరస్వామివారు తన దేవేరులతో క‌లిసి పాల్గొనే కలహ శృంగారభరితమైన ప్రణయ కలహ మ‌హోత్సవం డిసెంబ‌రు 28వ తేదీ గురువారం తిరుమలలో జరుగనుంది.

ఈ ఉత్సవాన్ని పురస్కరించుకొని సాయంత్రం 4 గంట‌లకు స్వామివారు, అమ్మవార్ల ఉత్సవమూర్తులు బంగారు పల్లకీలపై వేరువేరుగా వైభవోత్సవ మండపం నుండి ఊరేగింపుగా బయలుదేరి శ్రీ వరాహస్వామి ఆలయం వ‌ద్ద‌ ఒకరికొకరు ఎదురేగుతారు. ఇక్కడ అర్చకులు స్వామి, అమ్మవార్ల తరఫున వేరువేరుగా ఆళ్వారు దివ్యప్రబంధంలోని పాశురాలను స్తుతిస్తారు. ఆ తరువాత అమ్మవార్లు స్వామివారిని నిందాస్తుతి చేసిన అనంతరం ఒకరిపై ఒకరు పూల‌బంతులను విసరడం, స్వామివారు పుష్పఘాతం నుండి తప్పించుకోవడం వంటి ఆసక్తికరమైన సన్నివేశాలతో ఈ ప్రణయకలహ మహోత్సవం నిర్వహిస్తారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుద‌ల‌ చేయబడినది.