డిసెంబ‌రులో శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు

డిసెంబ‌రులో శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు
 
తిరుపతి, 2019 డిసెంబ‌రు 03: తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో డిసెంబ‌రు నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.

– డిసెంబ‌రు 7, 14, 21, 28వ తేదీల్లో శనివారం సందర్భంగా ఉదయం 6.00 గంటలకు శ్రీ సీతారామ లక్ష్మణుల మూలవర్ల అభిషేకం నిర్వహిస్తారు. భక్తులు రూ.20/- చెల్లించి మూలవర్ల అభిషేకంలో పాల్గొనవచ్చు. సాయంత్రం 6.00 గంటలకు స్వామి, అమ్మవారిని తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు, అనంతరం రాత్రి 7.00 గంటలకు ఆలయంలో ఊంజల్‌సేవ నిర్వహిస్తారు. రూ.116/- టికెట్‌ కొనుగోలు చేసి ఊంజల్‌సేవలో పాల్గొనవచ్చు.

– డిసెంబ‌రు 11న కార్తీక దీపోత్స‌వం సందర్భంగా రాత్రి 7 గంటలకు శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలోని శ్రీ పుండరీకవళ్లి అమ్మవారి సన్నిధి నుండి ఆలయ మర్యాదలతో పడి, కార్తీకదీపం, నూతన వస్త్రాలను ఊరేగింపుగా శ్రీ కోదండరామాలయానికి తీసుకొస్తారు. ఆ తరువాత దీపోత్సవం నిర్వహిస్తారు.  

– డిసెంబ‌రు 15న పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకుని ఉదయం 11 గంటలకు శ్రీ సీతారాముల కల్యాణం నిర్వహిస్తారు. రూ.500/- టికెట్‌ కొనుగోలు చేసి కల్యాణంలో పాల్గొనవచ్చు. సాయంత్రం 5.30 గంటలకు స్వామి, అమ్మవారిని తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధుల గుండా శ్రీరామచంద్ర పుష్కరిణి వద్దకు ఊరేగింపుగా తీసుకెళతారు. సాయంత్రం 6.30 గంటలకు ఊంజల్‌సేవ నిర్వహిస్తారు.

– డిసెంబ‌రు 26న సూర్య గ్ర‌హ‌ణం కార‌ణంగా ప్ర‌తి నెల అమావాస్య‌నాడు నిర్వ‌హించే సహస్రకలశాభిషేకం, హనుమంత వాహనసేవల‌ను టిటిడి ర‌ద్దు చేసింది.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.