BALALAYA FESTIVAL AT SRI VARAHASWAMY TEMPLE FROM DECEMBER 6-10 _ డిసెంబ‌‌రు 6 నుండి 10వ తేదీ వరకు తిరుమ‌ల శ్రీ వ‌రాహ‌స్వామివారి ఆలయంలో ” బాలాలయ మహాసంప్రోక్షణ ”

MAHA SAMPROKSHANA ON DECEMBER 10

Tirumala, 4 Nov. 20: TTD is organising the annual Balalaya program at the Sri Varahaswamy temple from December 6-10 for which Ankurarpanam will be performed on December 5th night.

According to Agama traditions Balalaya is conducted at any temple for rejuvenation of the sanctum with repairs and gold plating of the Vimanam etc. Since there will be no daily rituals during those days in the sanctum, a wooden model of the Mula Virat is installed in the Mukha Mandapam of temple for devotees darshan.

For the five days of developmental works of the sanctum, daily rituals of the deities are performed for the model Idols in the Mandapam.

TTD is also conducting special programs at the temple yagashala from December 6-10 and Maha prokshana of the temple is scheduled on December 10th morning in the Makara lagnam.

LEGEND OF VARAHASWAMY TEMPLE

Sri Varahaswamy also hailed, as ‘Sweta Varahaswamy’ is the first deity in the Venkatachala pilgrim Centre and is credited with privileges of first puja, first Naivedyam and First darshan.

Legends say that as per tradition devotees should first get darshan of Sri Varahaswamy ahead of darshan of Sri Venkateswara.

Puranam also contend that Sri Maha Vishnu took avatar of Sri Varahaswamy to destroy the demon Hiranyaksha and protect goddess Bhudevi.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

డిసెంబ‌‌రు 6 నుండి 10వ తేదీ వరకు తిరుమ‌ల శ్రీ వ‌రాహ‌స్వామివారి ఆలయంలో ” బాలాలయ మహాసంప్రోక్షణ ”

తిరుమల, 2020 న‌వంబ‌రు 04: తిరుమలలోని శ్రీ భూ వ‌రాహ‌స్వామివారి ఆలయంలో డిసెంబ‌రు 6 నుండి 10వ తేదీ వరకు తేదీ వరకు ”బాలాలయం” కార్యక్రమం శాస్త్రోక్తంగా జరుగనుంది.  ఈ కార్యక్రమానికి డిసెంబ‌రు 5వ తేదీ రాత్రి అంకురార్పణం జరుగనుంది.

సాధారణంగా గర్భాలయంలో జీర్ణోద్ధరణ కోసం ”బాలాలయం” చేపడతారు. శ్రీ వ‌రాహ‌స్వామివారి ఆలయ విమాన శిఖరంకు బంగారు పూత పూయ‌బ‌డిన రాగి రేకులు అమర్చేందుకు ఆరు నెల‌ల కాలం ప‌డుతుంది. ఈ సంద‌ర్భంగా భ‌క్తుల‌కు మూల విరామూర్తి ద‌ర్శ‌నం ఉండ‌దు. ఇందుకోసం ఆలయంలోని ముఖ మండపంలో నమూనా ఆలయం ఏర్పాటుచేసి గర్భాలయంలోని మూలవర్ల తరహాలో చెక్కతో విగ్రహాలను ఏర్పాటు చేస్తారు. ఈ 5 రోజుల పాటు స్వామి, అమ్మవార్లకు నిత్యకైంకర్యాలన్నీ ఇక్కడే నిర్వహిస్తారు.
 
ఆలయంలోని యాగశాలలో డిసెంబ‌రు 6 నుంచి 10వ తేదీ వరకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడతారు. డిసెంబరు 10వ తేదీ ఉదయం 9 నుంచి 10.30 గంటల మధ్య మకర లగ్నంలో మహాసంప్రోక్షణ నిర్వహిస్తారు.

క్షేత్ర ప్రాశ‌స్త్యం  :

వేంకటాచలక్షేత్రంలోని తొలిదైవం శ్రీ ఆదివరాహస్వామి. ఈయన్నే ‘శ్వేత వరాహస్వామి’ అంటారు. క్షేత్రసంప్రదాయం ప్రకారం ‘తొలిపూజ, తొలి నైవేద్యం, తొలిదర్శనం’ జరుగుతున్న ఈ వరాహస్వామిని దర్శించిన తర్వాతే శ్రీవేంకటేశ్వరుని దర్శించడం ఆచారం. శ్రీ మహావిష్ణువు లోక కల్యాణం కోసం శ్రీ వరాహస్వామివారి అవతారమెత్తి హిరణ్యాక్షుని సంహరించి భూదేవిని రక్షించినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది.
 
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.