VISAKHA SEER OFFERS PRAYERS AT TIRUCHANOOR _ తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారిని దర్శించుకున్న విశాఖ శారద పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర‌ సరస్వతి స్వామీజి

TIRUPATI, 15 MAY 2022: Visakha Sarada Peethadhipathi Sri Swarupanandendra Saraswati Swamy offered prayers along with Uttaradhikari Sri Swatmananda Saraswati Swamy at Tiruchanoor temple on Sunday.

 

Speaking on the occasion he said every year before he leaves for Rishikesh to perform Deeksha for three months, he takes the blessings of Swamy and Ammavaru.

 

Earlier on his arrival he was given traditional welcome by DyEO Sri Lokanatham, Annamacharya Project Director Dr A Vibhishana Sharma, AEO Sri Prabhakar Reddy, Superintendent Sri Madhu, Temple Inspector Sri Damodaram.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI



తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారిని దర్శించుకున్న విశాఖ శారద పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర‌ సరస్వతి స్వామీజి

తిరుపతి, 2022 మే 15: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారిని ఆదివారం విశాఖ శారద పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర‌ సరస్వతి స్వామి, శారదా పీఠం ఉత్తరాధికారి శ్రీశ్రీశ్రీ స్వాత్మానంద సరస్వతి స్వామి దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర‌ సరస్వతి స్వామి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం రిషికేష్ లో మూడు నెలల పాటు దీక్షకు వెళ్లేముందు తిరుమల శ్రీవారిని, శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకుంటున్నానని తెలిపారు. ఈ క్రమంలో అమ్మవారిని దర్శించుకున్నానని, అధికారులు చక్కటి ఏర్పాట్లు చేశారని చెప్పారు. వసంతోత్సవాల ప్రారంభం రోజు అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు.

ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న స్వామీజీలకు ఆలయ అధికారులు సంప్రదాయబద్ధంగా స్వాగతం  పలికారు. అమ్మవారి దర్శనానంతరం శేషవస్త్రం, ప్రసాదాలను అందించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ లోకనాధం, అన్నమాచార్య ప్రాజెక్టు డైరెక్టర్ డా.ఆకెళ్ల విభీషణ శర్మ, ఏఈవో శ్రీ ప్రభాకర్ రెడ్డి, సూప‌రింటెండెంట్ శ్రీ మధు, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్ శ్రీ దామోదరం పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.