TUDA CHIEF OFFERS SILK VASTRAMS TO GODDESS PADMAVATHI _ తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారికి ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్పించిన డా. చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి

Tiruchanoor, 27 Nov. 19: Dr Chevi Reddy Bhaskar Reddy, MLA of Chandragiri, TTD ex-officio member, Govt whip and TUDA Chairman presented silk clothes to Goddess Padmavati in view of Gaja Vahana Seva on Wednesday during the ongoing annual Karthika Brahmotsavams at Tiruchanoor.

Earlier he was received  with traditional honors at the temple Mahadwaram by the officials and archakas. Speaking on the ocassion Dr Reddy said he had come by padayatra from Tummalagunta to Tiruchanoor to present customary silk clothes on behalf of Sri Kalyanam Venkateswara Temple at Tummalagunta.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI 

తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారికి ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్పించిన డా. చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి

 తిరుపతి, 2019 నవంబరు 27: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా టిటిడి బోర్డు ఎక్స్ ఆఫిషియో స‌భ్యులు, చంద్ర‌గిరి ఎమ్మెల్యే, తుడ ఛైర్మ‌న్‌, ప్ర‌భుత్వ విప్ అయిన డా. చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి బుధ‌వారం ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్పించారు. ముందుగా ఆల‌యం వ‌ద్ద‌కు చేరుకున్న డా. భాస్క‌ర్‌రెడ్డికి ఆల‌య అధికారులు సంప్ర‌దాయబ‌ద్ధంగా స్వాగ‌తం ప‌లికి ద‌ర్శ‌న ఏర్పాట్లు చేశారు.

ఈ సంద‌ర్భంగా డా. భాస్క‌ర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ శ్రీ పద్మావతి అమ్మవారి  బ్రహ్మోత్సవాల‌ సందర్భంగా తుమ్మ‌ల‌గుంట‌లోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయం నుంచి పట్టువస్త్రాలను ఆన‌వాయితీగా స‌మ‌ర్పిస్తున్న‌ట్టు తెలిపారు. తుమ్మలగుంట నుంచి తిరుచానూరుకు పాదయాత్రగా వచ్చి పట్టువస్త్రాలు సమర్పించామని తెలియ‌జేశారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.