PATTU VASTRAMS PRESENTED TO TIRUNINRAVUR _ తిరునిన్రవూరు శ్రీ భక్తవత్సల పెరుమాళ్‌కు పట్టువస్త్రాలు సమర్పణ

TIRUMALA, 14 MARCH 2023: TTD EO Sri AV Dharma Reddy on Tuesday presented pattu vastrams to Sri Bhaktavatsala Perumal of Tiruninravur in Tiruvallur district of Tamilnadu on behalf of TTD.

This age-old temple is considered as one among the 108 Sri Vaishnava Divya Desams akin to Tirumala, Sri Rangam and others. Tirumala Sri Pedda Jeeyangar is the religious head and permanent Trustee of this ancient temple who was also present.

TTD has been presenting vastrams for the last one and a half decades.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తిరునిన్రవూరు శ్రీ భక్తవత్సల పెరుమాళ్‌కు పట్టువస్త్రాలు సమర్పణ

తిరుమ‌ల‌, 2023 మార్చి 14: తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా, తిరునిన్రవూరులో గల చారిత్రక పురాతనమైన శ్రీ భక్తవత్సల పెరుమాళ్‌ ఆలయానికి మంగళవారం సాయంత్రం టిటిడి ఈఓ శ్రీ ఎవి.ధర్మారెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు. తిరుమల శ్రీశ్రీ‌శ్రీ‌ పెద్దజీయర్‌స్వామి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీశ్రీ‌శ్రీ‌ పెద్దజీయర్‌స్వామివారు ఈ ఆలయానికి ఆధ్యాత్మికపెద్దగా వ్యవహరిస్తున్నారు. స్వామివారి కోరిక మేరకు 2010వ సంవత్సరం నుండి ఈ ఆలయ బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని టిటిడి శ్రీవారి కానుకగా పట్టువస్త్రాలు సమర్పిస్తోంది.

ముందుగా తిరునిన్రవూరులోని శ్రీశ్రీ‌శ్రీ‌ పెద్దజీయర్‌స్వామివారి మఠానికి ఈవో చేరుకున్నారు. అక్కడి నుంచి ఊరేగింపుగా ఆలయం వద్దకు చేరుకుని శ్రీ భక్తవత్సల పెరుమాళ్‌కు పట్టువస్త్రాలు సమర్పించారు. తిరు అనగా ‘శ్రీ లక్ష్మీ’ అని, నిన్ర అనగా ‘నిలబడి’ అని, వూరు అనగా ‘ప్రదేశం’ అని అర్థం. శ్రీలక్ష్మీదేవి నిలబడి ఉన్న ప్రదేశంగా తిరునిన్రవూరు గుర్తింపు పొందింది. 108 దివ్యదేశాల్లో ఈ ఆలయం ఒకటి.

ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.