KOIL ALWAR TIRUMANJANAM PERFORMED _ తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఘనంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

Tirupati, 25 Oct. 19: The temple cleansing fete Koil Alwar Tirumanjanam was performed with celestial fervour in Sri Kodanda Rama Swamy temple in Tirupati on Friday.

This fete was performed in connection with Deepavali Asthanam on October 27.

Deputy EO Smt Shanti and others took part.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

 

తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఘనంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

తిరుపతి, 2019 అక్టోబరు 25: తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో శుక్రవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం ఘనంగా జరిగింది. ఆలయంలో అక్టోబరు 27వ తేదీ దీపావళి ఆస్థానం సందర్భంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ.

ఈ సందర్భంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, సహస్రనామార్చన నిర్వహించారు. ఉదయం 6.00 నుండి 9.00 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరిగింది. ఇందులో భాగంగా ఆలయాన్ని శుద్ధి చేసి, పసుపు, కుంకుమ, చందనం, సీకాయ, నామం, కర్పూరం, కిచిలిగడ్డ, కస్తూరి పసుపు, పచ్చాకు తదితరాలతో తయారుచేసిన సుగంధద్రవ్యాన్ని గర్భాలయ గోడలకు పూశారు. అనంతరం ఉదయం 9.30 గంటల నుండి భక్తులకు సర్వదర్శనం కల్పించారు.

ఈ కార్యక్రమంలో టిటిడి డెప్యూటీ ఈవో శ్రీమ‌తి శాంతి, ఏఈవో శ్రీ తిరుమలయ్య, సూపరింటెండెంట్‌ శ్రీ ర‌మేష్‌, ఆలయ అర్చకులు, ఇతర అధికార ప్రముఖులు పాల్గొన్నారు.

అక్టోబర్ 27న దీపావళి ఆస్థానం

శ్రీ కోదండరామాలయంలో దీపావళి సందర్భంగా అక్టోబర్ 27వ తేదీ ఆదివారం రాత్రి 7.00 గంటలకు తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామివారి ఆలయం నుండి నూతన వస్త్రాలు, దోశపడి, దీపాలు తీసుకువచ్చి శ్రీకోదండరామస్వామివారికి సమర్పిస్తారు. అనంతరం ఆలయంలో దీపావళి ఆస్థానం ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా అమావాస్యనాడు ఆలయంలో నిర్వహించే సహస్ర కలశాభిషేకం, హనుమంత వాహనసేవల‌ను టిటిడి రద్దు చేసింది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.