ABHISHEKAM PERFORMED TO KALIYAMARDHANA KRISHNA _ తిరుమలలో ఘనంగా గోకులాష్టమి వేడుకలు

GOKULASTAMI ASTHANAM IN TIRUMALA TEMPLE

Tirumala, 04 September 2026: On the auspicious occasion of Gokulashtami, under the auspices of the TTD Garden Department, a grand Abhishekam was held to Kaliyamardhana Krishna at Gogarbham Gardens in Tirumala on Friday.

On this occasion, a special abhishekam was rendered to Swamy with milk, curd, honey, coconut water, turmeric and sandal paste.   

After that Annaprasadam was distributed followed by Utlotsavam wherein youth participated with enthusiasm in breaking the mud pots tied atop log pole.

Devotees enjoyed the celebrations.

Deputy Director of Garden Department Sri Srinivasulu and other staff participated in this program.

In Srivari Temple:

Meanwhile in the evening between 8pm and 9pm Sri Krishna Janmastami Asthanam will be performed inside Bangaru Vakili.

The religious staff and temple officials will take part in this traditional temple court.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER

తిరుమలలో ఘనంగా గోకులాష్టమి వేడుకలు

తిరుమల, 2026 సెప్టెంబర్ 04: తిరుమలలో శుక్రవారం గోకులాష్టమి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు.

గోగర్భం డ్యామ్‌ చెంతగల ఉద్యానవనంలో కాళీయమర్ధనుడు అయిన శ్రీకృష్ణునికి ఉదయం పంచాభిషేకాలు చేశారు. అనంతరం అక్కడ ఉట్లోత్సం నిర్వహించారు. ఆ తరువాత ప్రసాద వితరణ జరిగింది. ఉద్యానవన విభాగం డిప్యూటీ డైరెక్టర్ శ్రీ శ్రీనివాస్‌, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

కాగా, శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి వద్ద రాత్రి 8 నుండి 9గంటల నడుమ శ్రీ ఉగ్ర శ్రీనివాసమూర్తి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లు, శ్రీకృష్ణస్వామివారికి ఏకాంతంగా తిరుమంజనం, ద్వాదశ ఆరాధన నిర్వహిస్తారు. అనంతరం ప్రబంధ శాత్తుమొర, గోకులాష్టమి ఆస్థానం ఘనంగా చేపడతారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణుని జన్మ వృత్తాంతాన్ని వైదికులు నివేదిస్తారు.

శనివారం సాయంత్రం 4 నుండి రాత్రి 8 గంటల మధ్య తిరుమలలో అత్యంత వైభవంగా ఉట్లోత్సవం నిర్వహిస్తారు. శ్రీ మలయప్పస్వామివారు బంగారు తిరుచ్చిపై, శ్రీకృష్ణస్వామివారు మరో తిరుచ్చిపై తిరుమాడ వీధులలో ఊరేగుతూ ఈ ఉట్లోత్సవాన్ని తిలకిస్తారు.

ఈ కార‌ణంగా ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.