YUVA DHARMIKOTSAVAM  AIMS AT BUILDING A SPIRITUAL INDIA IN FUTURE- TTD PRO _ తిరుమలలో ఘనంగా ప్రారంభమైన యువ ధార్మిక సమ్మేళనం

TIRUMALA, 05 FEBRUARY 2023: The unique programme by TTD Dasa Sahitya Project, “Yuva Dharmikotsavam” aims at building a strong spiritual India by enhancing spiritual and ethical values among the youth population in the country, said TTD PRO Dr T Ravi.

Speaking on the inaugural session of the two-day Yuva Dharmikotsavam which commenced at Asthana Mandapam in Tirumala on Sunday, the PRO said, the youth should also learn good manners and ethical values which is possible only by enhancing their sense of spiritual knowledge so that they would emerge as the best citizens of India. 

The PRO also said, our ancestors have given us vast knowledge to lead a life full of ethics through Vedas, Puranas, Ithihasas, Epics and many more. The essence of all the valuable books are nothing but to live in a righteous manner by learning ethical values. We should learn the manners of listening to the good words of our parents and gurus from childhood itself which should help us in achieving the heights in our life in future”, he maintained.  

Later, Chief Audit Officer, Sri Sesha Sailendra said, the values which we learn and implement in our teens will reflect in our future. So the teenage is the right age to imbibe ethical and spiritual values. This is the reason why the youth of India are so strong and ideal to the entire world. He also quoted some examples from Ramayana, Maha Bharata, Bhagavata and other puranas. 

The Special Officer of Dasa Sahitya Project Sri Anandatheerthacharyulu said, the youth shall lead a righteous life by learning the ethical values being taught in Yuva Dharmikotsavam. 

Over 1600 youth from AP, TS, TN and Karnataka participated in this maiden programme mulled by TTD.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

 
భావి భారత నిర్మాణానికి నాంది ‘యువ ధార్మికోత్సవం’ : టిటిడి పిఆర్వో డాక్టర్ టి. రవి
 
యువ ధార్మిక సమ్మేళనం ద్వారా యువత ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చు : దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ పి.ఆర్‌.ఆనందతీర్థాచార్యులు
 
తిరుమలలో ఘనంగా ప్రారంభమైన యువ ధార్మిక సమ్మేళనం
 
తిరుమల, 2023 ఫిబ్రవరి 05: యువతకు విద్యతో పాటు వినయం, సంస్కారం అలవడినప్పుడే సమాజంలో చక్కటి పౌరులుగా భావి భారత నిర్మాణానికి నాంది అవుతారని టిటిడి పిఆర్వో డాక్టర్ టి.రవి అన్నారు. తిరుమల ఆస్థాన మండపంలో యువ ధార్మిక సమ్మేళనం రెండు రోజుల కార్యక్రమం ఆదివారం ఉదయం ఘనంగా ప్రారంభమైంది.
 
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పిఆర్వో  మాట్లాడుతూ, మన పూర్వీకులు మనకు అందించిన వేదాల్లోని సారాన్ని, అధ్యాత్మిక చింతనను చిన్నతనం నుండి అలవర్చుకుంటే జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చన్నారు. తల్లిదండ్రుల, గురువుల మాట వినాలని, తమ పని తాము చేసుకుంటూ ఆదర్శంగా నిలవాలన్నారు. 
సమాజంలో నడుచుకోవాల్సిన తీరు, మానవత్వంతో వ్యవహరించాల్సిన విధానం, దైవత్వం సాధించేందుకు చేయాల్సిన కృషి తదితర విషయాలను వివరించారు.
 
అనంతరం సిఏఓ శ్రీ శేషశైలేంద్ర మాట్లాడుతూ,  యుక్త వయసులో ప్రతి మానవునిలో గొప్ప పరిణామం కలుగుతుందని,  ఈ వయసులో నేర్చుకునే విషయాలు జీవితాంతం గుర్తుండిపోతాయని చెప్పారు.
ఈ కారణంగానే భారత యువతను ఆధ్యాత్మికంగా శక్తిమంతులుగా ఉన్నారని చెప్పారు. మానవ జీవితంలో రామాయణం, భగవద్గీత, భాగవతాల ప్రాముఖ్యతను వివరించారు.
 
దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ పి.ఆర్‌.ఆనందతీర్థాచార్యులు ప్రసంగిస్తూ, యువ ధార్మిక సమ్మేళనం ద్వారా యువత ఆధ్యాత్మికంగా ఉన్నతంగా జీవించవచ్చని చెప్పారు. ప్రతి ఒక్కరికి విద్య రావచ్చు గాని, సంస్కారం రాదని, సంస్కారం కలిగిన వ్యక్తి దేవుడు గురించి ఆలోచిస్తాడన్నారు. పక్షికి రెండు రెక్కలు ఉన్నట్లు, మనిషి ఉన్నత శిఖరాలను చేరుకోవడానికి రెండు రెక్కలు కావాలని, అందులో ఒకటి మానవ ప్రయత్నం, రెండవది దైవానుగ్రహం అని తెలియజేశారు. వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు సంస్కారవతమైన జీవితాన్ని అలవర్చుకోవడానికి ఎంతగానో ఉపయోగపడతాయని వివరించారు. 
 
ఈ కార్యక్రమంలో ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుండి విచ్చేసిన దాదాపు 1600 మంది 10 నుండి 15 సంవత్సరాల లోపు పిల్లలు పాల్గొన్నారు.
 
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.