BASHYAKARULA UTSAVA BEGINS AT TIRUMALA _ తిరుమలలో భాష్యకారుల ఉత్సవాలు ప్రారంభం

Tirumala, 26 April 2022: The 19-day fete of Bashyakarula Utsavam commenced at Srivari temple in Tirumala on Tuesday and will last till May 14.

Legend says that Sri Bhagavad Ramanujacharya had written a commentary titled Sri Bashyam for the Vishistadvaitha philosophy edict of Mimamsa and thereafter was named as Bashyakarulu.

The Bashyakarula fete was observed every year on Arudra star, the birth star of Sri Ramanujacharya.

On the first day of Bashyakarula utsavam, the utsava idol of Sri Ramanujacharya was paraded over Bangaru Tiruchi along the Mada streets of Srivari temple.

Tirumala pontiffs Sri Sri Sri Pedda Jeeyarswamy and Sri Sri Sri Chinna Jeeyarswamy, Parupattedar Sri Gurappa were present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI 

తిరుమలలో భాష్యకారుల ఉత్సవాలు ప్రారంభం

ఏప్రిల్ 26, తిరుమల 2022: తిరుమల శ్రీవారి ఆలయంలో భాష్యకారుల ఉత్సవాలు మంగ‌ళ‌వారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మే 14వ తేదీ వరకు 19 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగనున్నాయి. మే 5వ తేదీన శ్రీ భాష్యకార్ల సాత్తుమొర జరుగనుంది. భగవద్‌ రామానుజులు విశిష్టాద్వైత సిద్ధాంతపరంగా మీమాంస గ్రంథానికి ”శ్రీభాష్యం” పేరుతో వ్యాఖ్యానం చేశారు. అందుకే భాష్యకారులుగా పేరొందారు. శ్రీరామానుజులవారు జన్మించిన అరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని ప్రతి ఏడాదీ శ్రీవారి ఆలయంలో భాష్యకార్ల సాత్తుమొర నిర్వహిస్తారు.

భాష్యకారుల ఉత్సవాల మొదటిరోజున ఉదయం శ్రీవారి ఆలయంలో మొదటి గంట అనంతరం శ్రీ రామానుజులవారిని బంగారు తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్నజీయర్‌స్వామి, పార్‌ప‌త్తేదార్ శ్రీ గుర్ర‌ప్ప త‌దిత‌రులు పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.