తిరుమల తిరుపతి దేవస్థానములు – వేదపాఠశాలలు _ 2011-12 విద్యా సంవత్సర ప్రవేశ ప్రకటన

తిరుమల తిరుపతి దేవస్థానములు – వేదపాఠశాలలు _ 2011-12 విద్యా సంవత్సర ప్రవేశ ప్రకటన

తిరుపతి, మే 27, 2011: తిరుమల తిరుపతి దేవస్థానముల వారిచే నిర్వహించబడు చిలుకూరు, మంథని, విజయనగరం, కీసరగుట్ట, తాడిపత్రి, ఐ.భీమవరం వేదపాఠశాలల యందు ఈ క్రింద తెలుపబడిన విభాగములలో ప్రవేశము కొరకు వైదికసంప్రదాయ పద్దతి ప్రకారం ఉపనయనమైన, నిర్దిష్టవయస్సు, విద్యార్హతలుగల బాలుర నుండి దరఖాస్తులు కోరబడుచున్నవి. క్రింది నమూనాలలో పూర్తి చేసిన దరఖాస్తులను, పుట్టిన తేది, విద్యార్హతలు రుజువు చేసే ధ్రువపత్రం నకళ్ళను, స్వంత చిరునామా గల పోస్టు కార్డును జతపరచి ప్రిన్సిపాల్‌, యస్‌.వి.వేదపాఠశాల, ధర్మగిరి, తిరుమల-517 504, చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్‌ అను చిరునామాకు 30-6-2011 లోపుగా చేరునట్లు పంపవలెను. సంప్రదాయ పద్దతిలో శిక్షణ ఇవ్వబడి ఈ కోర్సుల అధ్యయన కాలంలో భోజనం వసతి మొదలగు సౌకర్యములు ఉచితముగా కల్పించబడుతాయి. వేదవిద్యార్థికి ఒక్కొక్కరికి రూ.3,00,000/- (మూడు లక్షలు రూపాయలు) మరియు స్మార్త/ఆగమ/ దివ్యప్రబంధ విద్యార్థికి ఒక్కొక్కరికి రూ.1,00,000/- (ఒక లక్ష రూపాయలు) చొప్పున బ్యాంకులో డిపాజిట్టు చేసి వారు తమ కోర్సును విజయవంతంగా పూర్తిచేసిన పిదప పారితోషికముగా వారికోసం వేసిన డిపాజిట్టు మరియు దానికి బ్యాంకు నుండి లభించు వడ్డి రెంటిని కలిపి మొత్తము విద్యార్థికి చెల్లించబడుతుంది. అభ్యర్థులు స్వంత ఖర్చులతో వ్రాత/ మైఖిక పరీక్షలకు హాజరు కావలెను. సిఫార్సుతో కూడిన దరఖాస్తులు తిసర్కరించబడును. ప్రవేశం విషయంలో యాజమాన్యం వారిదే అంతిమ నిర్ణయము.
 
ధర్మగిరిలో 2011-12 విద్యాసంవత్సరమునకు గాను ఏ విభాగము నందు కూడా ప్ర‌వేశములు లేవు.
ధరఖాస్తు నమూనా
1.అభ్యర్థి పేరు, 2. పుట్టిన తేది,
3.తండ్రి పేరు, 4.తల్లిపేరు
5.తండ్రి వృత్తి, 6.పూర్తి చిరునామా
7. సంప్రదాయానుసారం ఉపనయనం
జరిగనదా,
8.(వివరములు) (ఎ) కులము,
(బి) గోత్రము, (సి) ఋషిప్రవరలు,
(డి) సూత్రము
9.విద్యార్హతలు, 10.చేరదలచిన విభాగము (వివరములతో)
11.సంప్రదాయ విద్యల పూర్వ పరిచయము, 12. కేటాయించిన ఏ ఇతర విభాగములోనైనా చేరుటకు సమ్మతించెదరా, (అవును/కాదు)
13.అభ్యర్థి సంతకము, 14. తండ్రి / సంరక్షకుని సంతకము.
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.