తి.తి.దే ట్రస్టులకు విరాళాల వెల్లువ – డోనార్‌సెల్‌ డిప్యూటి.ఇ.ఓ

తి.తి.దే ట్రస్టులకు విరాళాల వెల్లువ – డోనార్‌సెల్‌ డిప్యూటి.ఇ.ఓ

తిరుమల,  12 జూన్‌  2013 : ప్రపంచ ప్రఖ్యాత హైందవ ధార్మిక సంస్థ అయిన తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచ నలుమూల నుండి విచ్చేసే భక్తులకు శ్రీవారి దర్శన, వసతి సౌకర్యాలు కల్పించడమే కాకుండా ఎన్నో సామాజిక అభివృద్ది కార్యక్రమాలు కూడా గత కొన్ని థాబ్దాలుగా 9 ట్రస్టులు మరియు ఒక స్కీమ్‌ ఏర్పాటు చేసి నిర్వహిస్తున్నదని డోనార్‌సెల్‌ ఉపకార్యనిర్వహణాధికారి శ్రీ రాజేంద్రుడు అన్నారు.

బుధవారంనాడు తిరుమలలోని సి.ఆర్‌.ఓలో వెలసివున్న  డోనార్‌సెల్‌ కార్యాలయంలోని తన ఛాంబర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇటీవల తి.తి.దే యాజమాన్యం దాతలపట్ల అనుసరిస్తున్న విధానాలను అనుసరించి దాతల నుండి విరాళాలు వెల్లువగా అందుతున్నాయన్నారు. ముఖ్యంగా గోసంరక్షణ, వేదపరిరక్షణ, హెరిటేజ్‌ ప్రిజర్‌వేషన్‌ ట్రస్టులకు కూడా విరాళాలు అధిక శాతంలో అందుతున్నాయన్నారు. దాతలకు తి.తి.దే కృతజ్ఞతా పూర్వకంగా వారికి ప్రత్యేక క్యాలండర్లను, ముఖ్యమైన పండుగల సమయంలో శుభాకాంక్షలు తెలియజేస్తూ కార్డులను పంపుతున్నామన్నారు. త్వరలో ఈ  డోనార్‌సెల్‌ కార్యాలయాన్ని తిరుమలలోని ఆదిశేషు అతిథి భవనం క్రింద రూ.50 లక్షలతో ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. కాగా దాతలు పెద్ద మనసుతో అందిస్తున్న విరాళాలతో తి.తి.దే చేపడుతున్న అభివృద్ది కార్యక్రమాలు ఎందరికో బాసటగా నిలుస్తున్నాయన్నారు.

2011-2012 మరియు 2012-2013లో దాతలు తి.తి.దే ట్రస్టులకు మరియు స్కీములకు అందించిన విరాళాల పట్టికను వెనుక పేజీలో చూడగలరు.
 
తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.