PEARLS, FRAGRANCE AND VEDIC CHANTS ENLIVEN SNAPAN TIRUMANJANAM_ తెల్ల ముత్యాలు, వట్టివేరు, కురువేరుతో వైభవంగా స్నపన తిరుమంజనం
SRI MALAYAPPA SWAMY AND HIS CONSORTS RECEIVE SACRED ABHISHEKAM AMIDST DIVINE GRANDEUR
Tirumala, 21 September 2026: The Ranganayakula Mandapam at Tirumala temple turned into a centre of divine splendour on Monday as the sacred Snapana Tirumanjanam was held to the Utsava deities of Sri Malayappa Swamy, Sridevi and Bhudevi with devotion and grandeur as part of the ongoing annual Brahmotsavams.
Garlands of Pearls, Dry Fruits, Kus kus add extra glamour:
The processional deities blessed devotees in magnificent attire, adorned with exquisite garlands woven with white pearls, fragrant vetiver, Kuruveru, dry fruits, bangles, Anjeer betelnut leaves, Yellow rose petals, and button chrysanthemums.
The captivating fragrance of the sacred ingredients and the vibrant beauty of the flowers filled the mandapam with an atmosphere of devotion and festivity.
Holy Bath Amidst Sacred Chants:
The archakas performed the Abhishekam from 1 p.m. to 3 p.m. in accordance with Vaikhanasa Agama traditions.
The deities received a sacred bath with milk, curd, coconut water, honey, turmeric and sandalwood paste.
The Ranganayakula Mandapam reverberated with Upanishad and Dashashanti mantras, Purusha Suktam, Sri Suktam, Bhu Suktam, Neela Suktam and Narayana Suktam recited by TTD Veda Parayanadars.
After the Abhishekam, Sri Sri Sri Pedda Jeeyangar and Sri Sri Sri Chinna Jeeyangar Swamijis of Tirumala along with their disciples recited sacred pasurams, adding the spiritual magnificence to the ceremony.
TTD EO Sri Muddada Ravichandra, Additional EO Sri Ch. Venkaiah Chowdary and other officials participated in the programme.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER
తెల్ల ముత్యాలు, వట్టివేరు, కురువేరుతో వైభవంగా స్నపన తిరుమంజనం
దివ్య మాలల మధ్య శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారి అభిషేకం
వేదమంత్ర ఘోషల నడుమ రంగనాయకుల మండపంలో ఆధ్యాత్మిక శోభ
తిరుమల, 2026 సెప్టెంబరు 21: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి సోమవారం స్నపన తిరుమంజనం భక్తిశ్రద్ధలతో వైభవంగా జరిగింది. తెల్ల ముత్యాలు, వట్టివేరు, కురువేరు, డ్రై ఫ్రూట్స్, గాజులు, వక్క ఆకులు తదితరాలతో రూపొందించిన విశేష మాలల మధ్య స్వామి, అమ్మవార్లు దివ్య అలంకారంలో భక్తులను అనుగ్రహించారు.
తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకు అర్చకస్వాములు వేదమంత్రోచ్ఛారణల నడుమ వైఖానస ఆగమోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారి ఉత్సవమూర్తులను ప్రత్యేక వేదికపై ఆశీనులను చేసి రంగురంగుల పుష్పాలతో సుందరంగా అలంకరించారు.
పంచామృతాలతో పవిత్ర అభిషేకం
ఈ సందర్భంగా స్వామి, అమ్మవార్లకు పాలు, పెరుగు, కొబ్బరినీళ్లు, తేనె, పసుపు, గంధంతో విశేష అభిషేకం చేశారు. శంఖనిధి, పద్మనిధి, సహస్రధార, కుంభధారణలతో శాస్త్రోక్తంగా స్నపనం నిర్వహించారు.
వేద ఘోషతో మార్మోగిన రంగనాయకుల మండపం
స్నపన తిరుమంజనం సందర్భంగా టీటీడీ వేద పారాయణదారులు ఉపనిషత్ మంత్రాలు, దశశాంతి మంత్రాలు, పురుషసూక్తం, శ్రీసూక్తం, భూసూక్తం, నీలాసూక్తం, విష్ణుసూక్తం తదితర పంచసూక్తాలను భక్తిభావంతో పారాయణం చేశారు.
అభిషేకానంతరం తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయ్యంగార్, శ్రీశ్రీశ్రీ చిన్న జీయ్యంగార్లు వివిధ దివ్య పాశురాలను పఠించారు.
సుగంధ పరిమళాల మధ్య దివ్య అలంకారం
ఈ వేడుకలో భాగంగా తెల్ల ముత్యాలు, వట్టివేరు, కురువేరు, డ్రై ఫ్రూట్స్, గాజులు, వక్క ఆకులు, పసుపు రేకులు, రోజాలు, బటన్ చామంతి మాలలతో స్వామి, అమ్మవార్లను విశేషంగా అలంకరించారు.
సుగంధ పరిమళాలు, పుష్పాల సౌరభం, వేదఘోషలు, భక్తిభావంతో రంగనాయకుల మండపం ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లింది.
ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో శ్రీ సి.హెచ్. వెంకయ్య చౌదరి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.



















