TTD TEMPORARILY HALTS RECEIVING GODANAM FROM DEVOTEES _ దేశవాళి పాడి ఆవులను మాత్రమే దానము చేయవలసినదిగా కోరడమైనది

TIRUPATI, MAY 19:  The temple administration of Tirumala Tirupati Devasthanams(TTD) has decided to temporarily halt accepting indigenous milk cow donations due to space problem and water scarcity in the Sri Venkateswara Goshala.
 
TTD has received voluminous response from the devotees as many pilgrims have voluntarily come forward and made bulk donations of cow and calf. But when medical test has been conducted to these cows, some of them exhibited the symptoms of viral disease. Since this disease is contagious and may easily spread to other cattle in the dairy farm, TTD has taken up initiatives to control the spread.
  
Apart from this, due to space constraint and severe water scarcity, TTD has decided to temporarily halt accepting donations and the pilgrims are requested to co-operate with TTD in this regard.
 
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
దేశవాళి పాడి ఆవులను మాత్రమే దానము చేయవలసినదిగా కోరడమైనది

 తిరుపతి, మే,19, 2011: తిరుమల తిరుపతి దేవస్థానము గోదానవితరణను ప్రోత్సహించడంలో భాగంగా ఇంతకు మునుపు దేశవాళి పాడి ఆవులను మాత్రమే తి.తి.దే. ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీవేంకటేశ్వర గోసంరక్షణశాలకు దానము చేయవలసినదిగా కోరడమైనది. దానికి గాను హర్షించదగ్గరీతిలో భక్తుల యొక్క స్పందన కార్యరూపము దాల్చినది. అధిక సంఖ్యలో దేశవాళి పాడి ఆవులు, దూడలతో సహా భక్తులు వితరణ చేసియున్నారు.

అయితే ఇటీవల ఈ గోవులకు నిర్వహించిన వైద్య పరీక్షలలో కొన్ని పాడిఆవులలో జబ్బులు వున్నట్లు వెల్లడి అయినది. ఈ జబ్బులు ప్రస్తుతం దేవస్థానం గోశాలలో యుండు పాడి పశువులకు కూడా సంక్రమించే అవకాశమున్నది. ఇందుకు గాను తగు చర్యలు తీసుకొనబడుచున్నవి.
 
కానీ, ప్రస్తుతము ఎస్‌.వి.గోసంరక్షణశాలలో స్థలాభావము మరియు త్రాగునీటి ఎద్దడి వున్న కారణముగా భక్తుల నుండి గోదాన స్వీకరణను తితిదే తాత్కాలికముగా నిలిపి వేయడానికి నిర్ణయించినది. కనుక భక్తులు మరియు ఇతర సేవా సంఘముల వారు ఈ విషయము గమనించి తితిదేకి సహకరించగలరని సవినయంగా కోరడమైనది.

రాష్ట్ర వ్యాప్తంగా ఆరవ విడత  కల్యాణమస్తు కార్యక్రమానికి సిద్దమైన తి.తి.దే.

తిరుమల తిరుపతి దేవస్థానము 2007వ సంవత్సరము నుండి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న ”కల్యాణమస్తు” – సామూహిక వివాహాల కార్యక్రమంలో భాగంగా ఈనెల 20వ తారీఖున నిర్వహించే ఆరవ విడత కార్యక్రమానికి  సన్నద్ధమైనది.
 
హిందూ సమాజంలోని అధిక శాతం పేద, మద్య తరగతి వారిని దృష్టిలో ఉంచుకొని ధార్మిక సేవా ధృక్ఫథంతో కల్యాణమస్తు కార్యక్రమానికి తితిదే శ్రీకారం చుట్టి గత ఐదేళ్ళుగా ఉచిత వివాహాలను నిర్వహిస్తోంది. ఇప్పటి వరకు 34,017 జంటలు శ్రీవెంకటేశ్వరస్వామి సాక్షిగా పవిత్రమైన కల్యాణబంధంలో ఒకటైనాయి. వీరే కాకుండా తమిళనాడులోని చెన్నైలో నిర్వహించిన కల్యాణమస్తు కార్యక్రమంలో 59 జంటలు కూడా వివాహం చేసుకున్నారు. ఈ యేడాది కూడా అదేవిధంగా రాష్ట్రప్రభుత్వ సౌజన్యంతో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడానికి తితిదే సిద్ధమైనది.
 
కాగా ప్రస్తుత కల్యాణమస్తు కల్యాణఘడియ ముహుర్తాన్ని తితిదే పండిత బృందం  మే 20వ తారీఖున వైశాఖ బహుళ తదియ నాడు కర్కాటక లగ్నం నందు మూలానక్షత్ర యుక్త శుభతిథి ఉదయం గం.9.52 ని. నుండి ఉదయం గం.10.04 ని. మధ్య ముహూర్తాన్ని నిర్ణయించడం జరిగింది.
 
ప్రస్తుతం జరుగనున్న 6వ విడత కల్యాణమస్తు కార్యక్రమం తిరుపతి మున్సిపల్‌ కార్పోరేషన్‌ ప్రాంగణంలోని లలితకాళావేదికలో జరుగనుంది.
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.