TTD FILES CASE ON FAKE LADDU WEBSITE _ OPERATORS నకిలీ వెబ్‌సైట్ నిర్వాహ‌కుల‌పై కేసు

నకిలీ వెబ్‌సైట్ నిర్వాహ‌కుల‌పై కేసు

తిరుప‌తి, 2020 డిసెంబ‌రు 10: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని ప్రపంచంలో ఎక్కడికైనా డోర్ డెలివరీ చేస్తామని సోషల్ మీడియాలో ప్రచారం చేసిన‌ www.balajiprasadam.com అనే నకిలీ వెబ్‌సైట్ నిర్వాహ‌కుల‌పై తిరుప‌తి ఈస్ట్ పోలీసులు డిసెంబ‌రు 8న కేసు నమోదు చేసిన‌ట్టు టిటిడి విజిలెన్స్ అధికారులు గురువారం ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు.

శ్రీ‌వారి ల‌డ్డూ ప్ర‌సాదాన్ని అంద‌జేస్తామంటూ డిసెంబ‌రు 6న ఈ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. టిటిడి ఛైర్మ‌న్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి ఆదేశాల మేర‌కు వెంట‌నే రంగంలోకి దిగిన విజిలెన్స్‌, ఐటి విభాగాల అధికారులు స‌ద‌రు న‌కిలీ వెబ్‌సైట్‌ను గుర్తించారు. డిసెంబ‌రు 7వ తేదీన సాయంత్రానికి ఈ వెబ్‌సైట్‌ను బ్లాక్ చేయించారు.

ఈ విధంగా భ‌క్తుల‌ను మోసం చేసే చ‌ర్య‌లు చేప‌ట్టినా, టిటిడికి సంబంధించిన అవాస్తవ సమాచారాన్ని సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసినా, ఫార్వర్డ్ చేసినా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని టిటిడి విజిలెన్స్ అధికారులు తెలియజేశారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

TIRUPATI, Dec 10: TTD has filed a case against fake laddu website www.balajiprasadam.com which cheated devotees on social media that it could deliver Srivari Laddu Prasadam anywhere in the world.

According to TTD vigilance wing officials, a case has been filed against the operators of the fake website on December 8 which was registered by the police at East Police station in Tirupati.

The fake website was launched on December 6 and publicized that it would deliver Srivari laddu Prasadam anywhere in the world.

On receiving the tip off, the TTD Board Chairman Sri YV Subba Reddy immediately directed Vigilance sleuths to identify and book case against the fake website operators who are playing with sentiments of devotees.

The TTD IT wing also plunged into action and immediately blocked the fake website on December 7. 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI