TRIAL RUN OF SRI SRINIVASA DIVYANUGRAHA HOMAM FROM SVVU HELD _ నవంబర్ 23న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్ర‌హ హోమం

Tirupati, 21 November 2023: TTD JEO for Health and Education Smt  Sada Bhargavi said on Tuesday that the auspicious Sri Srinivasa Diyanugraha Homan will begin at Sapta Pradakshina Mandiram at Alipiri from 9 am of November 23 and in this connection, a trial run procession by several cultural teams from SVVedic University grounds to Go Mandiram was held on Tuesday. 

Speaking on the occasion she said upon the directions of TTD Chairman Sri Bhumana Karunakara Reddy and EO Sri AV Dharma Reddy the trial run comprising of the students of Dharmagiri Veda Vijnana Peetham and SV Vedic University faculty along with the cultural teams were conducted to highlight the significance of the prestigious homam.

She also inspected the arrangements made by the engineering, health and Anna pradadam departments. 

Thereafter the SVVedic University VC Aacharya Rani Sadasiva Murthy highlighted the importance of the Homam to be performed daily for two hours and also described the rituals. 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

నవంబర్ 23న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్ర‌హ హోమం

– ఎస్వీ విశ్వ విద్యాలయం నుండి ట్రయల్ రన్

– జేఈవో శ్రీమతి సదా భార్గవి

తిరుపతి, 2023 న‌వంబరు 21: తిరుపతి, 2023 న‌వంబరు 21: అలిపిరిలోని సప్త గోప్ర‌ద‌క్షిణ‌ మందిరంలో నవంబరు 23వ తేదీ ఉదయం 9 గంటలకు శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమాన్ని టీటీడీ ప్రారంభించనున్నట్లు జేఈవో శ్రీమతి సదా భార్గవి తెలిపారు. ఎస్వీ వేద విశ్వవిద్యాలయం నుండి సప్త గోప్ర‌ద‌క్షిణ‌ మందిరం వరకు మంగళవారం ఉదయం వివిధ కళాబృందాలతో జేఈవో ట్రయల్ రన్ నిర్వహించారు.

ఈ సందర్భంగా జేఈవో మాట్లాడుతూ, టీటీడీ చైర్మన్ శ్రీ భుమ‌న కరుణాకర్ రెడ్డి, ఈవో శ్రీ ఎవి. ధర్మారెడ్డి ఆదేశాల మేరకు వివిధ కళాబృందాలతో ఎస్వీ వేద విశ్వవిద్యాలయం ప్రధాన భవనం నుండి సప్త గో ప్రదక్షిణ మందిరం వరకు ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం విద్యార్థులు, వేద విశ్వ‌విద్యాల‌యం అధ్యాప‌కులు, వివిధ కళాబృందాలతో ట్రైయ‌ల్ ర‌న్‌ నిర్వహించినట్లు తెలిపారు. హోమం యొక్క విశిష్టతను దేశం నలుమూలల తెలియజేయాలని ఈ యాత్ర‌ను నిర్వహించినట్లు చెప్పారు. ఇందులో ఇంజనీరింగ్, ఆరోగ్య, అన్నప్రసాద విభాగాల ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన‌ట్లు వివ‌రించారు.

అనంతరం ఎస్వీ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య రాణి సదాశివమూర్తి మాట్లాడుతూ, శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమాన్నిరెండు గంటల పాటు నిర్వహిస్తార‌న్నారు. వైఖాన‌స ఆగ‌మ శాస్త్రంలో చెప్పబడిన విధంగా పుణ్యాహవ‌చనం నుండి పూర్ణాహుతి వరకు నిర్వ‌హించు వివిధ క్ర‌తువుల‌ను ఆయ‌న‌ వివ‌రించారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.