నవంబర్‌ 26 నుండి 28 వరకు 3 రోజులపాటు గీతాజయంతి ఉత్సవాలు 

నవంబర్‌ 26 నుండి 28 వరకు 3 రోజులపాటు గీతాజయంతి ఉత్సవాలు

తిరుపతి, నవంబర్‌-24,2009: తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న హిందూధర్మప్రచారపరిషత్‌ కేంద్రాలలో నవంబర్‌ 26 నుండి 28 వరకు 3 రోజులపాటు గీతాజయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. అదేవిధంగా చెన్నై, బెంగుళూరు, గురువాయుర్‌,  తదితర ప్రాంతాలలో కూడా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తారు.

ఈ గీతాజయంతి సందర్భంగా శ్రీమథ్‌ భగవత్‌గీతలోని 12వ అధ్యాయం (భక్తియోగం) పై 3వ తరగతి నుండి 10వ తరగతి వరకు విద్యార్థీనీ, విద్యార్థులకు పఠన పోటీలు నిర్వహిస్తారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా పఠన పోటీలలో పాల్గొన్న విద్యార్థులను ఒక్కొక్క పాఠశాల నుంచి 5మంది చొప్పున ఎంపిక చేసి తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో జరుగు విష్ణు సహస్రనామం లేదా వెంకటేశ్వర సహస్రనామం అనే అంశంపై నిర్వహించే పోటీలలో వారికి అవకాశం ఇస్తారు.

ఈపఠన పోటీలలో గెలిపొందిన వారిని 3 విభాగాలుగా విభజిస్తారు.
గ్రూప్‌1:- 3వ తరగతి నుండి 5వ తరగతి వరకు
మొదటి బహుమతి-250/-, ద్వితీయ బహుమతి-200/-, తృతీయ బహుమతి-150/-
గ్రూప్‌2:- 6వ తరగతి నుండి 7వ తరగతి వరకు
మొదటి బహుమతి-250/-, ద్వితీయ బహుమతి-200/-, తృతీయ బహుమతి-150/-
గ్రూప్‌3:- 8వ తరగతి నుండి 10వ తరగతి వరకు
మొదటి బహుమతి-250/-, ద్వితీయ బహుమతి-200/-, తృతీయ బహుమతి-150/-

ప్రోత్సాహక బహుమతి క్రింద 10 మందిని ఎంపిక చేసి ఒక్కొక్కరికి 50/- రూపాయలు నగదు బహుమతి మరియు దేవస్థానముల ప్రచురణలను అందజేస్తారు. అదేవిధంగా జిల్లా స్థాయిలో గెలుపొందిన విద్యార్థినీ, విద్యార్థులకు పైవిధంగానే గ్రూపులవారిగా బహుమతులు ఇవ్వబడుతాయి.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.