DISPLAY OF VARIED ART FORMS DURING NAVARATRI BRAHMOTSAVAMS- TTD JEO (H&E) SMT SADA BHARGAVI _ న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాల్లో విభిన్న క‌ళారూపాలు – టీటీడీ జేఈవో శ్రీ‌మ‌తి స‌దా భార్గ‌వి

TIRUPATI, 07 OCTOBER 2023: TTD JEO (H&E) Smt. Sada Bhargavi directed the officials concerned to make arrangements to showcase varied art forms from different states to perform during the Vahana Sevas in the ensuing  Navratri Brahmotsavams to be held from October 15 to 23 in Tirumala. 
 
The JEO held a review with the officials of All Dharmic Projects in the conference hall of the TTD administrative building in Tirupati on Saturday.
 
On this occasion, the JEO said that there was a good response to the art exhibitions during the Salakatla Brahmotsavams, and wanted to organize enhanced art forms in Navratri Brahmotsavams to impress the multitude of visiting devotees.
 
She held an elaborate review with the authorities on artists, kind of performances etc.  JEO said that artists are coming from southern states as well as Odisha, Madhya Pradesh, Punjab, Gujarat, Jammu and Kashmir, Uttar Pradesh, Mizoram, Manipur and other states across the country.  She informed that priority is also to be given to folk dances along with the traditional dances of the respective states.
 
TTD CAuO Sri. Seshasailendra, SVBC CEO Sri. Shanmukh Kumar, All Dharmic Projects Program Officer Sri. Rajagopal, Hindu Dharma Prachara Parishad Secretary Sri. Srinivasulu, Dasa Sahitya Project Special Officer Dr.Sri Ananda Theerthacharyu,  Transport GM Sri. Sesha Reddy, Annamacharya Project Director  Dr. Akella Vibhishana Sharma also participated.
 
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాల్లో విభిన్న క‌ళారూపాలు – టీటీడీ జేఈవో శ్రీ‌మ‌తి స‌దా భార్గ‌వి

తిరుప‌తి, 2023 అక్టోబర్ 07: శ్రీ‌వారి న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాలు అక్టోబ‌రు 15 నుండి 23వ తేదీ వ‌ర‌కు జ‌రుగ‌నున్నాయ‌ని, వాహ‌న‌సేవ‌ల్లో ప్ర‌ద‌ర్శ‌న‌లిచ్చేందుకు వివిధ రాష్ట్రాల నుండి విభిన్న క‌ళారూపాల‌ను ప్ర‌ద‌ర్శించేందుకు ఏర్పాట్లు చేప‌ట్టాల‌ని టీటీడీ జేఈవో శ్రీమ‌తి స‌దా భార్గ‌వి అధికారుల‌ను ఆదేశించారు. హిందూ ధార్మిక ప్రాజెక్టుల అధికారుల‌తో జేఈవో శ‌నివారం తిరుప‌తిలోని టీటీడీ ప‌రిపాల‌నా భ‌వ‌నంలో గ‌ల స‌మావేశ మందిరంలో స‌మీక్ష నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా జేఈవో మాట్లాడుతూ సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాల్లో క‌ళాప్ర‌ద‌ర్శ‌న‌ల‌కు మంచి స్పంద‌న ల‌భించింద‌ని, న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాల్లో మ‌రింత‌గా భ‌క్తుల‌ను ఆక‌ట్టుకునేలా క‌ళారూపాల ప్ర‌ద‌ర్శ‌న‌లు ఏర్పాటు చేయాల‌న్నారు. రోజువారీగా ఏయే ప్రాంతం నుండి క‌ళాబృందాలు వ‌స్తున్నాయి, ఎలాంటి ప్ర‌ద‌ర్శ‌న‌లు ఇస్తున్నార‌నే అంశంపై అధికారుల‌తో సుదీర్ఘంగా చ‌ర్చించారు. ద‌క్షిణాది రాష్ట్రాల‌తోపాటు ఒడిశా, మ‌ధ్యప్ర‌దేశ్‌, పంజాబ్‌, గుజ‌రాత్‌, జ‌మ్మూకాశ్మీర్‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, మిజోరం, మ‌ణిపూర్ త‌దిత‌ర రాష్ట్రాల నుండి క‌ళాబృందాలు వ‌స్తున్న‌ట్టు జేఈవో తెలిపారు. ఆయా రాష్ట్రాల‌కు చెందిన సంప్ర‌దాయ నృత్యంతో పాటు జాన‌ప‌ద నృత్యాల‌కు ప్రాధాన్యం ఇస్తున్న‌ట్టు తెలియ‌జేశారు.

ఈ కార్య‌క్ర‌మంలో టీటీడీ సిఏవో శ్రీ శేష‌శైలేంద్ర‌, ఎస్వీబీసీ సిఈవో శ్రీ షణ్ముఖ్ కుమార్, ధార్మిక ప్రాజెక్టుల ప్రోగ్రామ్ ఆఫీస‌ర్ శ్రీ రాజ‌గోపాల్‌, హిందూ ధ‌ర్మ‌ప్ర‌చార ప‌రిష‌త్ కార్య‌ద‌ర్శి శ్రీ శ్రీ‌నివాసులు, దాస సాహిత్య ప్రాజెక్టు ప్ర‌త్యేకాధికారి శ్రీ ఆనంద‌తీర్థాచార్యులు, అన్న‌మాచార్య ప్రాజెక్టు సంచాల‌కులు డాక్టర్ ఆకెళ్ల విభీష‌ణ శ‌ర్మ‌, ట్రాన్స్‌పోర్టు జిఎం శ్రీ శేషారెడ్డి పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుద‌ల‌ చేయబడినది.