WOMEN POWER LEADING INDIA SINCE VEDIC PERIOD-VISAKHA SARADA PEETHAM PONTIFF _ నేటి యువతకు మార్గదర్శం శ్రీ మహాభారతం : శ్రీ‌శ్రీ‌శ్రీ స్వ‌రూపానందేంద్ర‌స్వామి 

OVERWHELMING RESPONSE TO “NARI NEERAJANAM” FROM WOMEN DEVOUT

 Tirumala, 7 Nov. 20: Describing Women as the Avatara of Goddess Shakti, the pontiff of Visakha Sarada Peetham HH Sri Swaroopanandendra Saraswathi Swamy said women have been leading the country as role model since vedic period.

Taking part in Keechaka Samharam-Nari Neerajanam programme at Nada Neerajanam platform on Friday evening at Tirumala, the pontiff said, Mahabharata always remains as an ideal epic as all the characters correlate to the contemporary world. “When Sri Pavana Kumara Sharma is rendering the Keechakavadha episode with great eloquence, I could witness the glow and shine in the eyes of the women devotees who have gathered here to participate in this unique programme”, he added.

Meanwhile the program lasted for nearly two hours. When Keechaka Samharam done, the women lit the Diya as a sign victory over evil forces and the modern day Keechakas with the background score of Ayigiri Nandini…rendered melodiously by singers of TTD projects. Later Sri Maruti rendered shlokas of Virata Parvam.

Junior Seer Sri Swatmananda Saraswathi Swamy, TTD Chairman Sri YV Subba Reddy, EO Dr KS Jawahar Reddy, Additional EO Sri AV Dharma Reddy and others were also programme.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

నేటి యువతకు మార్గదర్శం శ్రీ మహాభారతం : శ్రీ‌శ్రీ‌శ్రీ స్వ‌రూపానందేంద్ర‌స్వామి 

తిరుమల, 2020 నవంబర్  7: నేటి ఆధునిక కాలంలో ప్రతి యువతి, యువకులకు మార్గదర్శం శ్రీ మహాభారతం కావ్యం అని విశాఖ శార‌ద పీఠాధిప‌తి శ్రీ‌శ్రీ‌శ్రీ స్వ‌రూపానందేంద్ర‌స్వామివారు ఉద్గాటించారు.

శ్రీ‌శ్రీ‌శ్రీ స్వ‌రూపానందేంద్ర‌స్వామి, శ్రీశ్రీశ్రీ స్వాత్మానంద సరస్వతి స్వామితో కలిసి తిరుమ‌ల‌లోని నాద నీరాజ‌నం వేదిక‌పై శనివారం రాత్రి 8 నుండి 9.30 గంట‌ల వ‌ర‌కు ” కీచ‌క సంహారం – నారీ నీరాజ‌నం ” కార్యక్రమంలో పాల్గొన్నారు.  


శ్రీ‌శ్రీ‌శ్రీ స్వ‌రూపానందేంద్ర‌స్వామివారు అనుగ్రహభాషణం చేస్తూ మహాభారతంలో ప్రతి పర్వం ప్రతి ఒక్కరి జీవన విధానాలు, నైతిక విలువలు తెలియజేస్తాయన్నారు. మహాభారతం ప్రతి జీవితానికి అన్వయం అవుతుందని తెలిపారు. ప్రముఖ పండితులు శ్రీ పవన్ కుమార్ శర్మ కీచక సంహారమును అద్భుతంగా వివరిస్తూ ఉంటే ప్రతి స్త్రీ కళ్ళలో వెలుగు కనిపించిందన్నారు.

మ‌హాభార‌తంలో విరాట‌ప‌ర్వానికి ఎంతో ప్రాధాన్య‌త ఉంద‌న్నారు. పాండ‌వులు విరాట రాజు కొలువులో ఒక సంవ‌త్స‌రం అజ్ఞాత‌వాసం ముగించుకున్న త‌రువాతే వారికి విజ‌యం వరించింద‌న్నారు. ఈ అజ్ఞాత‌వాసంలో ఉండ‌గానే ద్రౌప‌దిని వేధిస్తున్న కీచ‌కుడిని భీముడు సంహ‌రిస్తాద‌న్నారు. మ‌హిళాశ‌క్తికి ప్ర‌తిరూప‌మైన ద్రౌప‌ది సాధించిన విజ‌యానికి సూచిక‌గా ఈ రోజు దీపారాధ‌న కార్య‌క్ర‌మాన్ని టీటీడీ నిర్వ‌హించిందన్నారు.

కాగా విరాట‌ప‌ర్వంలో కీల‌క ఘ‌ట్ట‌మైన కీచ‌క సంహారం సంద‌ర్భంగా దాదాపు 500 మ‌హిళ‌లతో  దీపాలు ( ప్ర‌మిద‌లు) దీపారాధ‌న కార్య‌క్రమం టీటీడీ నిర్వ‌హించింది. అనంతరం మహిళలు ” అయిగిరి నందిని నందిత మేదిని మహిషాసుర మర్దినీ….” ఆది పరాశక్తి అమ్మవారి సంకీర్త‌న‌ను కార్య‌క్ర‌మం ముగింపులో సుమ‌ధురంగా అల‌పించారు.

ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి ఛైర్మన్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి, ఈవో డా.కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్ రెడ్డి, అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, బోర్డు స‌భ్యులు శ్రీ‌మ‌తి వేమిరెడ్డి ప్ర‌శాంతి రెడ్డి, డా. నిశ్చిత‌, త‌దిత‌రులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.