KARTHIKA VISHNU PUJA FROM NOV 19 AT VASANTHA MANDAPAM _ న‌వంబ‌రు 19 నుండి వ‌సంత మండ‌పంలో విష్ణుపూజ‌లు

Tirumala, 18 November 2020: As part of Karthika month celebrations and to contain Covid impact on humanity, the TTD is organising unique Sri Mahavishnu Karthika Puja at Vasanta Mandapam in Tirumala from November 19 onwards.

Archakas of Srivari temple on Wednesday reviewed the arrangements to perform the Sri Mahavishnu Aradhana’s on the lines of Vaikhanasa Agama at Vasanta Mandapam in Tirumala.

On Thursday morning  the programs will begin with Vishnu Saligrama Puja which will be telecast by the SVBC channel between 8.30 am and 9.30 am.

The Vishnu puja program will be held on November 19, 22, 24-28 and there after from December 10- 13.

The programs as follows:

November 22 -Gopastami Go puja,

November 24 -Aswatha Puja (Rupa Vishnu) and Sarvabhouma vratam

November 25- Prabhodhana Ekadasi- Sri Rama Sameta Vishnu pujanam.

November 26: Ksheerabdi Dwadasi, Kaisika Dwadasi, Sri Tulasi Dhatri Sahita Damodar vratam

November 27 and December 11: Radha Damodara Puja.

November 28: Vaikunta Chaturdasi vratam and shiva-Keshav puja with lotus flowers.

December 1: Dhatri Vishnu puja

December 2: Achytarchana Go puja

December 5-10: Vishnu Saligrama puja

December 12: Tulasi Vishnu samaradhanam

December 13: Dhanvanthri Jayanti.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI 

న‌వంబ‌రు 19 నుండి వ‌సంత మండ‌పంలో విష్ణుపూజ‌లు

తిరుమల‌, 2020 నవంబరు 18: క‌రోనా నేప‌థ్యంలో లోక‌క్షేమాన్ని కాంక్షిస్తూ ప‌విత్ర‌మైన కార్తీక మాసంలో న‌వంబ‌రు 19 నుంచి డిసెంబ‌రు 13వ తేదీ వ‌ర‌కు తిరుమ‌ల వ‌సంత మండ‌పంలో శ్రీ‌మ‌హావిష్ణువుకు సంబంధించిన అనేక విశేష ఆరాధ‌న‌లు వైఖాన‌సాగ‌మబ‌ద్ధంగా నిర్వ‌హించాల‌ని టిటిడి నిర్ణ‌యించింది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్ల‌ను ఆల‌య అర్చ‌కులు బుధ‌వారం వ‌సంత మండ‌పంలో ప‌రిశీలించారు.

న‌వంబ‌రు 19న గురువారం విష్ణుసాల‌గ్రామ పూజ‌తో ఈ కార్య‌క్ర‌మాలు ప్రారంభం కానున్నాయి. ఉద‌యం 8.30 నుండి 9.30 గంట‌ల వ‌ర‌కు శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్‌లో ఈ పూజా కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేస్తారు. న‌వంబ‌రు 19, 22, 24 నుండి 28వ తేదీ వ‌ర‌కు, డిసెంబ‌రు 1, 2, 5వ తేదీల్లో, ఆ త‌రువాత డిసెంబ‌రు 10 నుండి 13వ తేదీ వ‌ర‌కు విష్ణుపూజా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తారు.

న‌వంబ‌రు 22న గోపాష్ట‌మి(గోపూజ‌), న‌వంబ‌రు 24న అశ్వ‌త్థ(రూప విష్ణు) పూజ, సార్వ‌భౌమ వ్ర‌తం, న‌వంబ‌రు 25న ప్ర‌బోధ‌నైకాద‌శి – శ్రీ‌ర‌మా స‌మేత విష్ణుపూజ‌నం, న‌వంబ‌రు 26న క్షీరాబ్ధిద్వాద‌శి, కైశిక‌ద్వాద‌శి – శ్రీ తుల‌సీ ధాత్రీ స‌హిత దామోద‌ర వ్ర‌తం, న‌వంబ‌రు 27, డిసెంబ‌రు 11వ తేదీల్లో శ్రీ రాధా దామోద‌ర పూజ‌, న‌వంబ‌రు 28న వైకుంఠ చ‌తుర్ద‌శీ వ్ర‌తం క‌మ‌ల‌ముల‌తో శివ‌కేశ‌వ పూజ నిర్వ‌హిస్తారు. అదేవిధంగా డిసెంబ‌రు 1న ధాత్రీ విష్ణు పూజ‌‌, డిసెంబ‌రు 2న అచ్యుతార్చ‌న, గోపూజ‌, డిసెంబ‌రు 5, 10వ తేదీల్లో విష్ణు సాల‌గ్రామ పూజ‌, డిసెంబ‌రు 12న తుల‌సీవిష్ణు స‌మారాధ‌నం, డిసెంబ‌రు 13న శ్రీ ధ‌న్వంత‌రీ జ‌యంతి కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌నున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.