PALLAKI GLITTERS WITH MOHINI _ పల్లకీపై మోహినీ అవతారంలో శ్రీ కోదండరాముడు

TIRUPATI, 09 APRIL 2024: On the fifth day on Tuesday, Sri Kodanda Rama dressed as Mohini casted His magic spell on devotees with ravishing celestial beauty.

The devotees were mesmerised to see the divine charm of Rama as Universal Damsel… Mohini on the colourfully decked Palanquin.

DyEO Smt Nagaratna and others were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

పల్లకీపై మోహినీ అవతారంలో శ్రీ కోదండరాముడు

తిరుపతి, 2024 ఏప్రిల్ 09: తిరుపతి శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మూత్సవాల్లో భాగంగా ఐదో రోజు మంగళవారం ఉదయం మోహినీ అవతారంలో శ్రీరామచంద్రుడు పల్లకీలో ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు.

ఉదయం 8 గంటలకు ఆల‌య నాలుగు మాడ వీధుల్లో ఈ ఉత్సవం జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

వాహ‌న‌సేవ‌లో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, ఏఈవో శ్రీ పార్థసారథి, కంకణబట్టార్ శ్రీ సీతారామాచార్యులు, సూపరింటెండెంట్‌ శ్రీ సోమశేఖర్, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ సురేష్, శ్రీ చలపతి పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.