CINTILLATING CULTURAL DISPLAY AT PALLAKI SEVA _ పల్లకీ సేవలో ఆక‌ట్టుకున్న క‌ళా బృందాల ప్ర‌ద‌ర్శ‌న‌

Tirupati,14 November 2023: On the fifth day of the ongoing annual Brahmotsavam of Sri Padmavati temple of Tiruchanoor, several cultural teams put up a display of sankeertans, dance etc. during the Pallaki Vahana Seva on Tuesday.

In all 12  artists of cultural teams presented their talents under the aegis of TTD Hindu Dharmic Projects which included portrayal of Devata murtis by artists of Bangalore followed by the Garbha dance of Gujarat, Dandia dance, Dimsa tribal dance of Telangana that allured the devotees.

Among others Chandi mela by women team of Palagat,  Kerala, Durga dance ballet by youth of Srinivasa Padmavati Bhajan team of  Tirupati, Bharata Natham and kolatam by students of SV College of music and dance held devotees spellbound.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

పల్లకీ సేవలో ఆక‌ట్టుకున్న క‌ళా బృందాల ప్ర‌ద‌ర్శ‌న‌

తిరుపతి, 2023 నవంబరు 14: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఐదవ రోజైన మంగళవారం ఉద‌యం పల్లకీ సేవలో వివిధ రాష్ట్ర‌ల‌ నుంచి విచ్చేసిన కళాబృందాలు అద్భుత‌ ప్రదర్శనలిచ్చాయి . టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వ‌ర్యంలో 12 కళాబృందాలలోని కళాకారులు సంగీత నృత్య ప్రదర్శనలతో భక్తులను పరవశింప చేశారు.

బెంగుళూరుకు చెందిన 25 మంది కళాకారులు వివిధ దేవతామూర్తుల రూపంలో దేవీ స్తుతి, 20 మంది యువతులు గుజరాతి గర్భ డాన్స్, మరో 19 యువ కళాకారులు గాండియా డాన్స్, 30 మంది కళాకారులు తెలంగాణ దింసా ట్రైబల్ డాన్స్ కనువిందు చేసింది.

తెలంగాణ రాష్ట్రం హైదరాబాదుకు చెందిన భారతి కూచిపూడి డాన్స్ అకాడమీ చెందిన 25 మంది యువతుల బృందం, సహస్ర క్రియేటివ్ అకాడమీకి చెందిన 26 మంది కళాకారుల బృందం ప్రదర్శించిన అన్నమయ్య సంకీర్తనలకు కూచిపూడి నృత్య ప్రదర్శన నయనానందకరంగా సాగింది.

కేరళ రాష్ట్రం పలక్కడ్ కు చెందిన 16 మంది మహిళల బృందం చండి మేళం ప్రదర్శన ఆకట్టుకుంది.

తిరుపతి శ్రీనివాస పద్మావతి భజన బృందం కు చెందిన 23 మంది యువతులు దుర్గ నృత్య రూపకం, ఎస్వీ సంగీత నృత్య కళాశాలకు చెందిన 22 మంది విద్యార్థుల బృందం భరతనాట్యం, కోలాటాలు భక్తులను పరవశింప చేశాయి.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.