TTD TEAM VISITS PUNE DAIRY _ పూణె లో పరాగ్ డెయిరీని సందర్శించిన టీటీడీ అధికారుల బృందం

TIRUPATI, 21 FEBRUARY 2023: As a part of its noble mission to develop Sri Venkateswara Dairy in a big way, a team of TTD officials led by JEO (H&E) Smt Sada Bhargavi inspected Parag Dairy near Pune on Tuesday.

 

They have studied and observed the process of high milch-yielding technology deployed in the Dairy Farm and the infrastructure.

 

The JEO requested the Dairy Farm management to send a detailed report to TTD to which they agreed to give as soon as possible.

 

CE Sri Nageswara Rao, Dairy Farm Director Dr Harnath Reddy, Veterinary University Extension Director Dr Venkata Naidu were also present.

 
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

పూణె లో పరాగ్ డెయిరీని సందర్శించిన టీటీడీ అధికారుల బృందం

– డెయిరీ అభివృద్ధి పై అధ్యయనం

తిరుపతి 21 ఫిబ్రవరి 2023: దేశీయ గో జాతులను అభివృద్ధి చేసి తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయానికి రోజువారి అవసరమయ్యే పాలు, పెరుగు, నెయ్యి సొంతంగా తయారు చేసుకోవడానికి కార్యాచరణకు దిగిన టీటీడీ దేశంలోని అత్యుత్తమ దేశీయ గోశాలలు,డెయిరీల పనితీరును పరిశీలిస్తోంది. ఇందులోభాగంగా జేఈవో శ్రీమతి సదా భార్గవి నేతృత్వంలో చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వరరావు, గోశాల డైరెక్టర్ డాక్టర్ హరనాథరెడ్డి, పశువైద్య విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకులు డాక్టర్ వెంకటనాయుడు బృందం మంగళవారం సాయంత్రం పూణె కు సమీపంలోని మంచార్ లో పర్యటించింది. ఆ గ్రామంలో ఉన్న పరాగ్ డెయిరీ కి చెందిన భాగ్యలక్ష్మి డెయిరీ ఫామ్ ను పరిశీలించారు. ఈ డెయిరీ లోని గో జాతుల ద్వారా అత్యధిక పాల ఉత్పత్తికి అనుసరిస్తున్న విధానాలను వీరు క్షేత్ర స్థాయిలో తెలుసుకున్నారు. ఆ డెయిరీ యాజమాన్యం సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి తక్కువ మంది సిబ్బందితో మంచి ఫలితాలు సాధిస్తున్న తీరును అధికారుల బృందం అధ్యయనం చేసింది. యంత్రాల సాయంతో గోవులకు కష్టం లేకుండా ఒకే సారి 50 గోవుల నుంచి సులువుగా పాలు పితికే విధానాన్ని పరిశీలించి అక్కడి అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

డెయిరీ నిర్వహణ, సాంకేతిక వ్యవస్థ, ఖర్చు తదితర వివరాలన్నింటితో తమకు ఒక నివేదిక అందించాలని జేఈవో శ్రీమతి సదా భార్గవి భాగ్యలక్ష్మి డెయిరీ యాజమాన్యాన్ని కోరారు. వీలైనంత త్వరగా నివేదిక అందించడానికి వారు అంగీకరించారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది