PEDDA SESHA VAHANAM HELD _ పెద్దశేష వాహనంపై శ్రీ మ‌ల‌య‌ప్ప క‌టాక్షం

TIRUMALA, 29 OCTOBER 2022: In connection with Nagula Chaviti, Pedda Sesha Vahana Seva was held with religious fervour in Tirumala on Saturday evening.

 

Sri Malayappa in all His grandeur, flanked by Sridevi and Bhudevi on either sides took out a celestial ride on the seven hooded mighty Pedda Sesha Vahanam to bless devotees all along four Mada streets.

 

This procession took place between 7pm and 9pm and was telecasted live on SVBC for the sake of global devotees.

 

One of the chief priests Sri Venugopala Deekshitulu, DyEO Sri Ramesh Babu, EE Sri Jaganmohan Reddy, Health Officer Dr Sridevi, Peishkar Sri Sreehari, VGO Sri Bali Reddy and others were also present.

 
 
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

పెద్దశేష వాహనంపై శ్రీ మ‌ల‌య‌ప్ప క‌టాక్షం

తిరుమల, 2022 అక్టోబరు 29: నాగులచవితి ప‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని శనివారం రాత్రి శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మలయప్పస్వామివారు పెద్దశేషవాహనంపై భ‌క్తులను క‌టాక్షించారు. రాత్రి 7 నుండి 9 గంటల నడుమ స్వామి, అమ్మ‌వార్లు తిరుమాడ వీధుల్లో ద‌ర్శ‌న‌మివ్వ‌గా పెద్ద‌సంఖ్య‌లో భ‌క్తులు ద‌ర్శించుకున్నారు.

సర్పరాజైన ఆదిశేషువు జగన్నాథునికి నివాస భూమిగా, తల్పంగా, సింహాసనంగా స్వామివారికి విశేష సేవలందించినట్లు పురాణాలు చెబుతున్నాయి. శ్రీ వేంకటేశ్వరస్వామి సహస్రనామాలతో శేషసాయి, శేషస్తుత్యం, శేషాద్రి నిలయం అంటూ నిత్యపూజలందుకుంటున్నాడు. అటు రామావతారంలో లక్ష్మణుడిగా, కృష్ణావతారంలో బలరామునిగా స్వామివారికి అత్యంత సన్నిహితునిగా వ్యవహరించే ఆదిశేషువు శ్రీవైకుంఠంలోని నిత్యసూరులలో ఆద్యుడు. ఈ విధంగా స్వామివారు దాసభక్తికి మారు రూపంగా నిలిచే తన ప్రియ భక్తుడైన శ్రీ ఆదిశేషుడిపై ఉభయదేవేరులతో కూడి ఊరేగుతూ భక్తులకు అభయమివ్వడమే కాకుండా శరణాగతి ప్రపత్తిని కూడా సాక్షాత్కరింపచేస్తున్నాడు. అందుకే స్వామివారు బ్రహ్మోత్సవ వాహనసేవలలో కూడా తొలి ప్రాధాన్యత ఆదిశేషునికే ఇచ్చారు.

ఈ కార్య‌క్ర‌మంలో శ్రీవారి ఆల‌య ప్రధానార్చకుల్లో ఒకరైన శ్రీ వేణుగోపాల దీక్షితులు, డెప్యూటీ ఈవో శ్రీ ర‌మేష్‌బాబు, ఇఇ శ్రీ జగన్ మోహన్ రెడ్డి, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ శ్రీదేవి, పేష్కార్ శ్రీ శ్రీ‌హ‌రి, విజివో శ్రీ బాలిరెడ్డి, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.