CHANDA MELA AND GARIGE DANCE STEAL THE SHOW _ పెద్దశేష వాహన‌సేవ‌లో ఆక‌ట్టుకున్నచండ మేళం, గెరిగె నృత్యం

Tiruchanoor, 24 Nov. 19: The colourful Garige tribal dance and the Chanda mela steal the show during Pedda Sesha Vahanam on Sunday morning at Tiruchanoor.

The artists of HDPP, Dasa Sahitya Project, and Annamacharya project are presenting different art forms during the on-going Brahmotsavams of Sri Padmavathi Ammavari.

The 13 members Gonvindaman Chanda mela of Kerala popular as Kerala drums attracted the devotees with their various resonating sounds of drum beats.

On the other hand, Garige tribal dance of East Godavari district comprising 14 members danced to rythematic tunes with Gariges on their head which also entertained the devotees. 

ISSUED BY TTDs PUBLIC RELATION OFFICER, TIRUPATI 

పెద్దశేష వాహన‌సేవ‌లో ఆక‌ట్టుకున్నచండ మేళం, గెరిగె నృత్యం

తిరుపతి, 2019 న‌వంబ‌రు 24: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం పెద్ద‌శేష వాహ‌న‌సేవ‌లో చండ మేళం, గెరిగ‌ నృత్యం, భ‌ర‌త‌నాట్యం, కోలాటం త‌దిత‌ర క‌ళాప్ర‌ద‌ర్శ‌న‌లు భ‌క్తుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి. టిటిడి హిందూ ధ‌ర్మ‌ప్ర‌చార ప‌రిష‌త్‌, అన్న‌మాచార్య ప్రాజెక్టు, దాస‌సాహిత్య ప్రాజెక్టు ఆధ్వ‌ర్యంలో ఈ ప్ర‌ద‌ర్శ‌న‌లు ఏర్పాటుచేశారు.

35 ఏళ్లుగా కేర‌ళ గోవింద‌మ‌ణి చండ‌మేళం

కేర‌ళ రాష్ట్రం కొళ్లాం ప్రాంతంలోని కొడ‌గ‌ల్‌కు చెందిన శ్రీ గోవింద‌మ‌ణి బృందం 35 ఏళ్లుగా తిరుచానూరులోని శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల్లో చండ‌మేళం(కేర‌ళ డ్ర‌మ్స్‌) వాయిస్తున్నారు. ఈ బృందంలో మొత్తం 13 మంది క‌ళాకారులు ఉన్నారు. వీరు డ్ర‌మ్స్‌, తాళాలు ల‌య‌బ‌ద్ధంగా వాయిస్తూ అందుకు అనుగుణంగా అడుగులు వేస్తూ నృత్యం చేస్తారు. ఈ వాయిద్య ప్ర‌ద‌ర్శ‌న ఎంతో విన‌సొంపుగా ఉంటుంది. వీరు టిటిడి ఆధ్వ‌ర్యంలోని ఒంటిమిట్ట శ్రీ కోదండ‌రామాల‌యం, తిరుప‌తిలోని శ్రీ క‌పిలేశ్వ‌రాల‌యం, శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆల‌యం, శ్రీ కోదండ‌రామాల‌యం, శ్రీ‌నివాస‌మంగాపురంలోని శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌రాల‌యంలో జ‌రిగే బ్ర‌హ్మోత్స‌వాల్లోనూ చండ మేళం వాయిస్తారు.

గెరిగె నృత్యం

తూర్పుగోదావ‌రి జిల్లా మ‌క్కామ‌ల‌కు చెందిన శ్రీ కుమార్ బృందం గెరిగె నృత్యాన్ని చ‌క్క‌గా ప్ర‌ద‌ర్శించారు. మొత్తం 14 మంది క‌ళాకారులు ఉండ‌గా, వీటిలో గెరిగెలు 6, తాశాలు 4, తంబుష‌లు 4 ఉన్నాయి. తాశాలు, తంబుష‌లు వాయిస్తుండ‌గా మిగ‌తా క‌ళాకారులు త‌ల‌పై గెరిగెలు ఉంచుకుని ర‌మ్యంగా నృత్యం చేశారు.

అదేవిధంగా, చెన్నైకి చెందిన శ్రీ‌మ‌తి అంజ‌నా వినోద్‌కుమార్ ఆధ్వ‌ర్యంలోని శ్రీ క‌లాక్షి స్కూల్ ఆఫ్ డ్యాన్స్ బృందం 22 క‌ళాకారుల‌తో చ‌క్క‌టి భ‌ర‌త‌నాట్యాన్ని ప్ర‌ద‌ర్శించారు. తిరుప‌తికి చెందిన శ్రీ ఆలూరు రాజ‌మోహ‌న్ ఆధ్వ‌ర్యంలోని అన్న‌మ‌య్య సంకీర్త‌నా కోలాట బృందం, శ్రీ‌మ‌తి రాధ ఆధ్వ‌ర్యంలోని అన్న‌మ‌య్య శ‌ర‌ణాగ‌తి బృందం, శ్రీ‌మ‌తి హ‌రిత ఆధ్వ‌ర్యంలోని నంద‌నంద‌న బృందం, శ్రీ‌మ‌తి రేవ‌తి ఆధ్వ‌ర్యంలోని వైభ‌వ వేంక‌టేశ్వ‌ర బృందం చ‌క్క‌గా కోలాట నృత్యాన్ని ప్ర‌ద‌ర్శించారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.