SRINIVASA KALYANAM IN EVERY DISTRICT _ ప్రతి జిల్లాలో శ్రీనివాస కళ్యాణాలు – హెచ్ డి పిపి సమీక్షలో నిర్ణయం

Tirumala, 5 Feb. 21: As part of the Sanatana Hindu dharma propagation campaign TTD has decided to conduct Srinivasa Kalyanam fete henceforth in every district of Telugu states said TTD Chairman Sri YV Subba Reddy.

The decision came at a review meeting of HDPP held at Annamaiah Bhavan on Friday in the presence of the TTD Chairman.

He directed the officials to be ever prepared to present a pair of desi cow and a calf to any temple which applied under the Gudiko-Gomata program.

He also urged officials to conduct an extensive awareness campaign on donations of desi breed of cows to TTD.

It was also decided to fix a muhurt and date for the relaunch of the   Kalyanamastu program.

TTD EO Dr KS Jawahar Reddy, Additional EO Sri AV Dharma Reddy, CVSO Sri Gopinath Jatti, Chief Engineer Sri Ramesh Reddy, HDPP Secretary Acharya Rajagopalan, HDPP OSD Dr Hemant Kumar, HDPP executive member Sri Penchalaih were present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ప్రతి జిల్లాలో శ్రీనివాస కళ్యాణాలు – హెచ్ డి పిపి సమీక్షలో నిర్ణయం

హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా ప్రతి జిల్లాలో శ్రీనివాస కళ్యాణాలు నిర్వహించాలని టీటీడీ నిర్ణయించింది.

తిరుమల 5 జనవరి 2021: తిరుమల అన్నమయ్య భవనంలో శుక్రవారం టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి హిందూ ధర్మ ప్రచార పరిషత్ పై సమీక్ష జరిపారు.

గుడికో గోమాత కింద ఏ ఆలయం దరఖాస్తు చేసుకున్నా గోవు, దూడ అందించేందుకు సిద్ధంగా ఉండాలని చైర్మన్ అధికారులను ఆదేశించారు. దేశీయ గోవులను దానంగా స్వీకరిస్తున్న విషయం గురించి ప్రజలకు మరింతగా తెలిసేలా చర్యలు తీసుకోవాలన్నారు. కళ్యాణ మస్తు ప్రారంభానికి ముహూర్తం నిర్ణయించి అందుకు తగ్గ ఏర్పాట్లు చేయాలని సమావేశంలో నిర్ణయించారు.

ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి, అదనపు ఈవో శ్రీ ఏవి ధర్మారెడ్డి, సివి ఎస్వో శ్రీ గోపీనాథ్ జెట్టి, చీఫ్ ఇంజినీర్ శ్రీ రమేష్ రెడ్డి, హెచ్ డిపిపి కార్యదర్శి ఆచార్య రాజగోపాలన్, హెచ్ డిపిపి ప్రత్యేకాధికారి డాక్టర్ హేమంత్ కుమార్ హెచ్ డిపిపి కార్యనిర్వాహక మండలి సభ్యులు శ్రీ పి పెంచలయ్య సమావేశంలో పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది