GRAND FESTIVITIES AT SRI GOVINDARAJA SWAMY TEMPLE IN FEBRUARY _ ఫిబ్రవరిలో శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు

Tirupati, 22 January 2026: Several important festivals will be observed at Sri Govindarajaswamy Temple, Tirupati, during the month of February. 

The details are as follows:

February 1: Conclusion of the Teppotsavams

February 3:  Pranaya Kalahotsavam

February 5: In connection with Uttara Nakshatra,  procession along the four mada streets at 6.00 p.m.

February 7: As part of Adhyayanotsavams  Pedda Sattumora.

February 10: On the concluding day of Adhyayanotsavams, Sri Govindarajaswamy along with Sridevi and Bhudevi, Sri Andal Ammavaru, Senadhipati and Alwars will be taken in a grand procession in the morning to Alwar Theertham near Kapila Theertham, where Sattumora and Asthanam will be conducted. Later, the deities will return to the temple.

February 12: On the occasion of Garuda Seva as part of the Brahmotsavams of Sri Kalyana Venkateswaraswamy at Srinivasamangapuram, the garlands of Sri Andal Ammavaru will be taken in a procession from Sri Govindarajaswamy Temple at 6.30 a.m.

February 16: Shravana Nakshatra and procession of Sri Kalyana Venkateswaraswamy along with Sridevi and Bhudevi 

February 25: On the occasion of Rohini Nakshatra, Sri Parthasarathiswamy along with Rukmini and Satyabhama will take a procession at 6 p.m. 

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

 

ఫిబ్రవరిలో శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు

తిరుపతి, 2026 జ‌న‌వ‌రి 22: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఫిబ్రవరి నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.

–   ఫిబ్ర‌వ‌రి 1న శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి తెప్పోత్స‌వాలు ముగింపు.

•  ఫిబ్రవరి 3న ప్ర‌ణ‌య క‌ల‌హ మ‌హోత్స‌వం సంద‌ర్భంగా సాయంత్రం శ్రీ గోవింద‌రాజ‌స్వామివారు ఆల‌య నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భ‌క్తుల‌ను అనుగ్ర‌హించ‌నున్నారు.

•  ఫిబ్రవరి 5న ఉత్తర నక్షత్రాన్ని పురస్కరించుకుని సాయంత్రం 6 గంట‌లకు ఉభయనాంచారులతో కలిసి శ్రీగోవిందరాజస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు.

•  ఫిబ్రవరి 6, 13, 20, 27వ తేదీల్లో శుక్రవారం నాడు సాయంత్రం సాయంత్రం 6 గంట‌లకు ఆలయ మాడవీధుల్లో శ్రీ ఆండాళ్‌ అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు.

•  ఫిబ్రవరి 7న అధ్యాయ‌నోత్స‌వాల‌లో భాగంగా పెద్ద శాత్తుమొర సంద‌ర్భంగా సాయంత్రం 5.30 గంట‌లకు ఉభయనాంచారులతో కలిసి శ్రీగోవిందరాజస్వామివారు, శ్రీన‌మ్మ‌ళ్వార్‌ ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను క‌టాక్షించ‌నున్నారు.

–  ఫిబ్రవరి 10న అధ్యాయ‌నోత్స‌వాల ముగింపు సంద‌ర్భంగా ఉద‌యం శ్రీదేవి, భూదేవి స‌మేత శ్రీ గోవింద‌రాజ‌స్వామివారు, శ్రీ ఆండాళ్ అమ్మ‌వారు, సేనాధిప‌తివారు, ఆళ్వార్లు కపిలతీర్థం వద్దగల ఆళ్వార్‌ తీర్థానికి ఊరేగింపుగా తీసుకెళ్లి శాత్‌మొర‌, ఆస్థానం నిర్వ‌హిస్తారు. అనంత‌రం తిరిగి ఆల‌యానికి చేరుకుంటారు.

•  ఫిబ్రవరి 12న శ్రీ‌నివాస‌మంగాపురం శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి బ్ర‌హ్మోత్స‌వాల‌లో భాగంగా నిర్వ‌హించ‌నున్న గ‌రుడ‌సేవ సంద‌ర్భంగా ఉద‌యం 6.30 గంట‌ల‌కు శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం నుంచి శ్రీ ఆండాళ్‌ అమ్మవారి మాలల ఊరేగింపు.  

–  ఫిబ్రవరి 16న శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని సాయంత్రం 6 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు.

–     ఫిబ్ర‌వ‌రి 25న రోహిణి నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు రుక్మిణి, సత్యభామ సమేత శ్రీపార్థసారధిస్వామివారు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షిస్తారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడి