TTD SCULPTURE EXHIBITION FROM FEBRUARY 13-15 _ ఫిబ్రవరి 13 నుండి 15 వరకు శిల్పకళా ప్రదర్శన 

Tirupati,11 February 2023:  A three day sculpture cum sale exhibition is being held from February 13-15 at Sri Venkateswara traditional sculpture college of TTD in the institution premises.

TTD EO Sri AV Dharma Reddy will inaugurate the exhibition aimed to procure international recognition for products and skill set by the artist students of the college which will remain open from  10.30am till 6.00 pm on these three days.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

 

ఫిబ్రవరి 13 నుండి 15 వరకు శిల్పకళా ప్రదర్శన

తిరుపతి 11 ఫిబ్రవరి 2023: తిరుపతి లోని అలిపిరి సమీపంలో ఉన్న శ్రీ వేంకటేశ్వర సంప్రదాయ ఆలయ నిర్మాణ శిల్పశిక్షణ సంస్థ ( శిల్పకళాశాల)లో ఫిబ్రవరి 13 నుండి 15వ తేదీ వరకు శిల్పకళా ప్రదర్శన, అమ్మకాల ను నిర్వహించనున్నారు.

13వ తేదీ ఉదయం 10-30 గంటలకు టీటీడీ ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి ప్రదర్శన శాలను ప్రారంభిస్తారు. ప్రతిరోజు ఉదయం 10 నుండి సాయంత్రం 6 గంటల వరకు ఈ ప్రదర్శన ఉంటుంది. శిల్పకళా కారుల నైపుణ్యం మరింత పెంపొందించడానికి, వారు తయారు చేసిన శిల్పాలకు ప్రపంచవ్యాప్త గుర్తింపు తేవాలనే ఉద్దేశంతో ఏటా మూడు సార్లు శిల్పకళా ప్రదర్శన నిర్వహించాలని టీటీడీ నిర్వహించిన విషయం తెలిసిందే. ఇందులో
భాగంగానే ఫిబ్రవరి 13 నుండి 15వ తేదీ వరకు ప్రదర్శన నిర్వహించనున్నారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది