HANUMAN BIRTH PLACE BHOOMI PUJA ON FEB 16- TTD EO _ ఫిబ్రవరి 16న తిరుమలలో హనుమాన్ జన్మస్థలం భూమి పూజ : టిటిడి ఈవో

BLUEPRINT FOR TARIGONDA VENGAMAMBA DHYANA MANDIR

 Tirumala, 8 February 2022: TTD EO Dr KS Jawahar Reddy said on Tuesday that TTD is all set to conduct the Bhumi puja program for Hanuman birthplace works at Anjanadri on February 16, on the auspicious day of Magha Pournami.

Along with Additional EO Sri AV Dharma Reddy the EO inspected the arrangements at Akasa Ganga on Tuesday morning.

Speaking to media later the TTD EO said after the board decision based on historic, geographic and puranic evidences the region of Hanumanta birthplace is decided to be developed into a sacred edifice with beautification etc. for which Bhumi Puja is scheduled on February 16.

A booklet highlighting Anjanadri as birthplace of Hanuman will also be released on the occasion.

He said works were taken up under the guidance of art director Sri Ananda Sai with financial contributions by former board members Sri Nageswara Rao and Sri Murali Krishna. As part of the Project Mukha Mandapam, Gopurams etc. will be built opposite to temples of Anjanadevi and Bala Anjaneya and near Go Garbham dam with additional donations from Rotary personnel.

He said TTD has invited Pontiff of Visakha Sarada Peetham Sri Swaroopananda Saraswati, Sri Rama Janma Nirmana Trust Treasurer Swami Govinda Dev Giri Maharaj, Chitrakoot Pontiff Sri Ramabhadracharyulu, Sri Koteswara Sharma and other prominent religious heads.

For the benefit of devotees across globe the program will be live telecasted from morning 9.30 am onwards.

The TTD board has decided to develop the 1.5 acre land around Tarigonda Vengamamba with Dhyana mandir, landscape garden and an action plan is being readied for same.

Earlier they inspected the ground breaking puja region at Akasaganga region and made valuable suggestions to officials. Later they also inspected the Go garbham Dam, Ring road junction and Brindavan of Tarigonda Vengamamba.

TTD CVSO Sri Gopinath Jatti, CE Sri Nageswara Rao, SE-2 Sri Jagadeswara Reddy, Incharge DFO Smt Prashanthi, EE Jaganmohan Reddy, VGO Sri Bali Reddy, former TTD board member Sri Nageswara Rao, Art director Sri Ananda Sai and others were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

ఫిబ్రవరి 16న తిరుమలలో హనుమాన్ జన్మస్థలం భూమి పూజ ‍:

– త‌రిగొండ వెంగ‌మాంబ ధ్యాన‌మందిరం నిర్మాణానికి బ్లూ ప్రింట్ సిద్ధం చేయాలి : టిటిడి ఈవో

తిరుమల, 2022 ఫిబ్ర‌వ‌రి 08: తిరుమలలోని అంజనాద్రిలో హనుమంతుని జన్మస్థలానికి భూమి పూజను ఫిబ్రవరి 16న మాఘ పౌర్ణమి నాడు నిర్వహించనున్నట్లు టిటిడి ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్ రెడ్డి తెలిపారు. ఆకాశ‌గంగ వ‌ద్ద భూమి పూజ ఏర్పాట్ల‌ను ఈవో, అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డితో క‌లిసి మంగ‌ళ‌వారం ప‌రిశీలించారు.

అనంతరం ఈవో మీడియాతో మాట్లాడుతూ తిరుమల ఆకాశ గంగ సమీపంలోని అంజనాద్రి శ్రీ ఆంజనేయ‌స్వామివారి జన్మస్థల‌మ‌ని భౌగోళిక, పౌరాణిక‌, శాస్త్రీయంగా ఆధారాలతో టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి ప్రకటించింద‌న్నారు. ఇందులో భాగంగా ఈ ప్రాంతాన్ని పుణ్యక్షేత్రంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించి, సుందరీకరణ చేపట్టేందుకు టిటిడి ఫిబ్రవరి 16న భూమిపూజ నిర్వహించనున్న‌ట్లు చెప్పారు. ఈ సంద‌ర్భంగా హ‌నుమంతుని జ‌న్మ‌వృత్తాంతంపై పుస్త‌కం విడుద‌ల చేస్తామ‌న్నారు.

అంజ‌నాదేవి, బాల ఆంజ‌నేయ‌స్వామివారి ఆల‌యం ఎదురుగా ముఖ మండ‌పం, గోపురాలు, గోగ‌ర్భం డ్యాం వ‌ద్ద రోట‌రీ దాత‌ల స‌హ‌కారంతో ఏర్పాటు చేస్తామ‌న్నారు. టిటిడి మాజీ బోర్డు స‌భ్యులు శ్రీ నాగేశ్వ‌ర‌రావు, శ్రీ ముర‌ళీ కృష్ణ ఆర్ధిక స‌హ‌యంతో ప్ర‌ముఖ ఆర్ట్ డైరెక్ట‌ర్ శ్రీ ఆనంద సాయి ఆధ్వార్యంలో నిర్మాణాలు చేప‌ట్ట‌నున్న‌ట్లు వివ‌రించారు.

విశాఖ శారద పీఠం పీఠాధిపతి శ్రీ స్వరూపానంద సరస్వతీ స్వామి, అయోధ్య శ్రీ రామ‌జ‌న్మ భూమి ఆల‌య నిర్మాణ ట్ర‌స్టు కోశాధికారి స్వామి గోవింద్ దేవ్ గిరి మహారాజ్‌, చిత్రకూట్ పీఠాధిపతి శ్రీ రామభద్రాచార్యులు, శ్రీ కోటేశ్వ‌ర‌ శ‌ర్మ‌ తదితర ఆధ్యాత్మిక ప్రముఖులను ఈ ఉత్సవానికి పాల్గొన‌నున్నార‌ని ఆయ‌న తెలిపారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న భ‌క్తుల కొర‌కు ఈ కార్య‌క్ర‌మాన్ని ఉద‌యం 9.30 గంట‌ల నుండి ఎస్వీబిసిలో ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేస్తామ‌న్నారు.

అదేవిధంగా తిరుమ‌ల‌లోని త‌రిగొండ వెంగ‌మాంబ బృందావ‌నంలో ఉన్న 1.5 ఎక‌రాల స్థ‌లం అభివృద్ధి చేయాల‌ని టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి నిర్ణ‌యించింద‌న్నారు. ఇక్క‌డ ధ్యాన‌మందిరం, ఉద్యాన‌వ‌నం ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు తెలిపారు. త్వ‌ర‌లో ఇందుకు సంబంధించి కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక‌లు రూపొందించి, బృందావ‌నం అభివృద్ధి ప‌నులు ప్రారంభించ‌నున్న‌ట్లు ఈవో చెప్పారు.

అంత‌కుముందు ఈవో ఆకాశ‌గంగ ప‌రిస‌రాల్లో భూమి పూజ నిర్వ‌హించే ప్రాంతాన్ని ప‌రిశీలించి అధికారుల‌కు ప‌లు సూచ‌న‌లు చేశారు. అనంత‌రం గోగ‌ర్భం డ్యాం, రింగ్ రోడ్డు ప‌రిస‌రాల‌లో నూత‌నంగా అభివృద్ధి చేసిన కూడ‌ళ్ళ‌ను, త‌రిగొండ వెంగ‌మాంబ బృందావ‌నంను ఆయ‌న అధికారుల‌తో క‌లిసి ప‌రిశీలించారు.

టిటిడి సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి, సిఇ శ్రీ నాగేశ్వ‌ర‌రావు, ఎస్వీబిసి సిఈవో శ్రీ సురేష్‌కుమార్‌, ఇంచార్జ్ డిఎఫ్‌వో శ్రీ‌మ‌తి ప్ర‌శాంతి, ఎస్ఇ -2 శ్రీ జ‌గ‌దీశ్వ‌ర్‌రెడ్డి, ఇఇ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి, విజివో శ్రీ బాలిరెడ్డి, మాజీ టిటిడి బోర్డు స‌భ్యులు శ్రీ నాగేశ్వ‌ర‌రావు, ఆర్ట్ డైరెక్ట‌ర్ శ్రీ ఆనంద సాయి, ఇత‌ర అధికారులు ఈవో వెంట ఉన్నారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుద‌ల‌ చేయబడినది.