RATHASAPTAMI AT NARAYANAVANAM TEMPLE ON FEBRUARY 16 _ ఫిబ్రవరి 16న నారాయణవనం శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో రథసప్తమి

Tirupati, 07 February 2024: Rathasaptami will be observed at  Sri Kalyana Venkateswara Swamy Temple in Narayanavanam on February 16.

The day will be celebrated with grandeur.

It is customary to organize Rathasaptami festivals in the local temples of TTD to celebrate Magha Shuddha Saptami which happens to be Surya Jayanthi every year. 

The deities of Swamy and Ammavarlu will grace the procession on seven main vehicles and bless the devotees.

The Vahanam schedule is as follows: From 6.30 am to 7.30 am Surya Prabha Vahanam, 8 am to 8.30 am – Chinna Shesha Vahanam, 9 am to 9.30 am- Pallaki Utsavam, from 10 am to 10.30 am Kalpavriksha, from 11.30 am to 12 noon Pedda Shesha Vahanam, from 12.30 pm to 1 pm-Tiruchi, From 6.30 pm to 8 pm Chandraprabha vehicles.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

ఫిబ్రవరి 16న నారాయణవనం శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో రథసప్తమి

తిరుపతి, 2024 ఫిబ్రవరి 07: నారాయణవనం శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో రథసప్తమి పర్వదినాన్ని వైభవంగా నిర్వహించనున్నారు.

ప్రతి సంవత్సరం మాఘ శుద్ధ సప్తమి సూర్యజయంతిని పురస్కరించుకొని టీటీడీ స్థానిక ఆలయాల్లో రథసప్తమి ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీ. ఆరోజు ఉదయం భానుని తొలిరేఖలు సూర్యప్రభ వాహనంలో కొలువైన స్వామివారి లలాటపలకం, నాభి, పాదకమలాలపై ప్రసరించే అద్భుత దృశ్యాన్ని తిలకించడానికి భక్తులు వేయికళ్లతో ఎదురుచూస్తుంటారు.

స్వామీ అమ్మవార్లు ఏడు ప్రధాన వాహనాలపై ఊరేగి భక్తులను అనుగ్రహించనున్నారు.

ఉదయం 6.30 నుండి 7.30 గంటల వరకు సూర్యప్రభ వాహనం, ఉదయం 8 నుండి 8.30 గంటల వరకు చిన్న శేష వాహనం, ఉదయం 9 నుండి 9.30 గంటల వరకు పల్లకి ఉత్సవం, ఉదయం 10 నుండి 10.30 గంటల వరకు కల్పవృక్ష, 11.30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పెద్ద శేష వాహనం, మధ్యాహ్నం 12.30 నుండి 1గంట వరకు తిరుచ్చిపై విహ‌రించి భ‌క్తుల‌ను క‌టాక్షించ‌నున్నారు.

సాయంత్రం 6.30 నుండి రాత్రి 8 గంటల వరకు చంద్రప్రభ వాహనాలపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.