SPECIAL DARSHAN FOR SENIOR CITIZEN, CHALLENGED AND PARENTS OF 5-YEAR INFANTS ETC. ON FEB 25-26 _ ఫిబ్ర‌వ‌రి 25న‌ వృద్ధులు, దివ్యాంగులకు, 26న చంటిపిల్లల తల్లిదండ్రులకు శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం

Tirumala, 24 Feb. 20: TTD has rolled out special darshan for senior citizens, challenged persons and parents of infants of below five years on February 25-36

As part of the exercise monthly exercise on Tuesday February 25 for senior citizen (above 65 years) and challenged persons, TTD is giving 4000 tokens (1000 tokens at 10.00 am, 2000 tokens at 2.00 hours slot and 1000 tokens for 3.00 pm slot.

Similarly TTD plans to provide darshan for parents with infants of below five years from 9.30 am to 1.30 pm o. February 26Wednesday. Through Supatham gate entry.

It may be noted that every day TTD provided daily Darshan facility through Supatham gate for parents with one-year-old children found the year.  Similarly, senior citizens and handicapped persons are provided Srivari Darshan daily in two slots through special entry gate near S.V Museum.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI     

ఫిబ్ర‌వ‌రి 25న‌ వృద్ధులు, దివ్యాంగులకు, 26న చంటిపిల్లల తల్లిదండ్రులకు శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం

ఫిబ్రవరి 24, తిరుమ‌ల‌, 2020: కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి దర్శనం ఎక్కువ మంది వయోవృద్ధులు, దివ్యాంగులకు, 5 సంవత్సరాలలోపు చంటి పిల్లలకు, వారి తల్లిదండ్రులకు కల్పించాలన్న ఉన్నతాశయంతో టిటిడి ప్రతి నెలా రెండు సామాన్య రోజుల్లో ప్రత్యేక దర్శనాలు కల్పిస్తోంది.

ఇందులో భాగంగా ఫిబ్ర‌వ‌రి 25న‌ మంగ‌ళ‌వారం వయోవృద్ధులు(65 సం|| పైబడినవారు), దివ్యాంగులకు 4 వేల టోకెన్లను టిటిడి జారీ చేయనుంది. ఉదయం 10 గంటల స్లాట్‌కు వెయ్యి, మధ్యాహ్నం 2 గంటలకు 2 వేల టోకెన్లు, 3 గంటల స్లాట్‌కు వెయ్యి టోకెన్లు జారీ చేస్తారు. వృద్ధులు, దివ్యాంగులు రద్దీ రోజుల్లో తిరుమలకు వచ్చి ఇబ్బందులు పడకుండా, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టిటిడి కోరుతోంది.

అదేవిధంగా, ఫిబ్ర‌వ‌రి 26న బుధ‌వారం 5 సంవత్సరాలలోపు చంటిపిల్లలను, వారి తల్లిదండ్రులను ఉదయం 9 నుండి మధ్యాహ్నం 1.30 గంటల వరకు సుపథం ద్వారా దర్శనానికి అనుమతిస్తారు. సాధారణ రోజుల్లో ఒక సంవత్సరం లోపు చంటిపిల్లలకు, వారి తల్లిదండ్రులకు సుపథం మార్గం ద్వారా ప్రవేశం కల్పిస్తారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.