COMPLETE FEED MIXING PLANT AND SECOND UNIT OF AGARBATTIS ON FAST PACE-JEO(H & E) _ ఫీడ్ మిక్సింగ్ ప్లాంట్, అగరబత్తీల రెండో యూనిట్ నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలి- టీటీడీ జేఈవో శ్రీమతి సదా భార్గవి 

TIRUPATI, 07 FEBRUARY 2023: TTD JEO for Health and Education Smt Sada Bhargavi on Tuesday directed the officials concerned to complete the Feed Mixing Plant and second unit of Agarbattis on a fast pace.

 

The JEO along with the officials inspected the ongoing works of the Feed Mixing Plant in SV Gosala. As part of it she verified the civil, electrical and machinery works which are in finishing phase. She instructed the officials concerned to complete all these works within a week. 

 

Later she also inspected the ongoing works of Second Unit of Agarbattis and directed the officials concerned to enhance the production and also discussed on the necessary flowers to be supplied for the same. 

 

Speaking to media persons she said, with the setting up of feed mixing plant, cows, oxen and other cattle in Gosala will be provided with healthy fodder. As there is a huge demand from public for TTD Agarbattis, it has been decided to set up Second Agarbatti Manufacturing Unit and enhance the production to meet the demand, she added.

 

Veterinary University VC Dr Padmanabha Reddy, CE Sri Nageswara Rao, Gosala Director Dr Harinath Reddy, SE Electrical Sri Venkateswarulu, EE Sri Manoharam, Additional HO Sri Sunil Kumar were also present.

 
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ఫీడ్ మిక్సింగ్ ప్లాంట్, అగరబత్తీల రెండో యూనిట్ నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలి- టీటీడీ జేఈవో శ్రీమతి సదా భార్గవి

తిరుపతి 7 ఫిబ్రవరి 2023: టీటీడీ గోశాలలో నిర్మిస్తున్న ఫీడ్ మిక్సింగ్ ప్లాంట్, అగర బత్తీల రెండో యూనిట్ నిర్మాణ పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని జేఈవో శ్రీమతి సదా భార్గవి అధికారులను ఆదేశించారు.

అధికారులతో కలసి మంగళవారం ఆమె ఈ పనుల ప్రగతిని పరిశీలించారు. ఫీడ్ మిక్సింగ్ ప్లాంట్ లో చివరి దశలో ఉన్న సివిల్, విద్యుత్ , యంత్రాల పనితీరు పరిశీలన పనులు వారం రోజుల్లోపు పూర్తి చేయాలని ఆమె ఆదేశించారు.

అనంతరం ఆమె అగరబత్తీల తయారీ రెండో యూనిట్ పనులు పరిశీలించి, సంబంధిత అధికారులతో మాట్లాడారు. ప్రస్తుతం జరుగుతున్న ఉత్పత్తిని రెట్టింపు చేయడానికి అవసరమైన పూల సరఫరా, ఇతర ఏర్పాట్ల గురించి జేఈవో అధికారులకు పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా శ్రీమతి సదా భార్గవి మీడియాతో మాట్లాడారు. ఫీడ్ మిక్సింగ్ ప్లాంట్ ఏర్పాటుతో గోశాలలోని గోవులు, ఎద్దులు, ఇతర జంతువులకు నాణ్యమైన దాణా తయారు చేసి అందించవచ్చునన్నారు. భక్తుల నుంచి విపరీతమైన డిమాండ్ ఉండటంతో అగరబత్తీల ఉత్పత్తిని డబుల్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు జేఈవో వివరించారు. ఫీడ్ మిక్సింగ్ ప్లాంట్, అగర బత్తీల రెండో యూనిట్ ను త్వరలో ప్రారంభించనున్నట్లు ఆమె తెలిపారు.

పశువైద్య విశ్వవిద్యాలయం ఉప కులపతి డాక్టర్ పద్మనాభ రెడ్డి, టీటీడీ చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వరరావు, గోశాల డైరెక్టర్ డాక్టర్ హరనాథ రెడ్డి, ఎస్ఈ శ్రీ వెంకటేశ్వర్లు, ఈఈ శ్రీ మనోహర్, అదనపు ఆరోగ్యాధికారి డాక్టర్ సునీల్ కుమార్ పాల్గొన్నారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది