PROVIDE COMFORTABLE FACILITIES TO CULTURAL TEAMS- JEO (H&E) _ బ్రహ్మోత్సవాలకు విచ్చేసే కళాబృందాలకు చక్కటి వసతులు కల్పించాలి – టీటీడీ జెఈవో శ్రీమతి సదా భార్గవి

Tirumala,31 August 2023: TTD JEO   for Health and Education, Smt Sada Bhargavi has directed officials to provide comfortable and better facilities like rooms, transport, food etc. to the cultural teams arriving from different states to participate in the festivities of Srivari twin Brahmotsavams.

Addressing a review meeting with the officials at Annamaiah Bhavan in Tirumala on Thursday the JEO said the arrangements should be made at Dharmagiri Veda Pathashala for all the artists participating in the morning and evening Vahana Sevas with delicious arrangements for breakfast, lunch and dinner besides medical and transport facilities in co-ordination with the senior officials of all projects.

Earlier the TTD JEO along with the officials visited the accommodation allocated for artists at Dharmagiri and PAC-2 and inspected the kitchen, security, Medical infrastructure and made valuable suggestions.

TTD SE-2 Sri Jagadeeshwar Reddy, HDPP Secretary Sri Srinivasulu, program officer Sri Rajagopal, Dasa Sahitya project special officer Sri Anandathirthacharyulu, Transport GM Sri Sesha Reddy, reception Dyeo Sri Bhaskar, catering special officer Sri Shastri, Estate Wing special officer Sri Mallikarjuna were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

బ్రహ్మోత్సవాలకు విచ్చేసే కళాబృందాలకు చక్కటి వసతులు కల్పించాలి – టీటీడీ జెఈవో శ్రీమతి సదా భార్గవి

తిరుమల, 2023 ఆగస్టు 31: రానున్న శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో వాహన సేవల్లో ప్రదర్శనలిచ్చేందుకు వివిధ రాష్ట్రాల నుండి విచ్చేసే కళాబృందాలకు చక్కటి సౌకర్యాల కల్పనకు ముందస్తు చర్యలు చేపట్టాలని టీటీడీ జెఈవో శ్రీమతి సదా భార్గవి అధికారులను ఆదేశించారు. తిరుమల అన్నమయ్య భవనంలో గురువారం అధికారులతో జెఈవో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల్లో ఉదయం, రాత్రి వాహన సేవల్లో పాల్గొనే కళాకారులకు వారికి తగ్గట్టుగా ధర్మగిరి వేద పాఠశాలలో బస ఏర్పాట్లు చేయాలన్నారు. వసతితో పాటు భోజనం, రవాణా సదుపాయాలు కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కళాకారుల ఆరోగ్య పరిరక్షణకు వైద్య విభాగం ఆధ్వర్యంలో ప్రథమ చికిత్స కేంద్రం ఏర్పాటు చేయాలన్నారు. కళాకారులకు సౌకర్యాల కల్పనకు టీటీడీలోని వివిధ ప్రాజెక్టులకు చెందిన సిబ్బందిని ప్రత్యేకంగా కేటాయించాలన్నారు. వీరు ఇతర విభాగాలతో సమన్వయం చేసుకుంటారని చెప్పారు.

అంతకుముందు కళాకారుల కోసం కేటాయించిన ధర్మగిరి వేద పాఠశాల, పీఏసీ-2లోని సౌకర్యాలను జెఈవో పరిశీలించారు. ధర్మగిరి వేద పాఠశాలలో భోజనం, వంటశాల, భద్రత తదితర అంశాలపై అధికారులతో చర్చించారు.

ఈ సమీక్షలో టీటీడీ ఎస్ఇ-2 శ్రీ జగదీశ్వర్ రెడ్డి, హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి శ్రీ శ్రీనివాసులు, ప్రోగ్రాం ఆఫీసర్ శ్రీ రాజగోపాల్, దాస సాహిత్య ప్రాజెక్ట్ ప్రత్యేకాధికారి శ్రీ ఆనందతీర్థాచార్యులు, రవాణ విభాగం జిఎం శ్రీ శేషారెడ్డి, రిసెప్షన్ డెప్యూటీ ఈవో శ్రీ భాస్కర్, క్యాటరింగ్ ప్రత్యేకాధికారి శ్రీ శాస్త్రి, ఎస్టేట్ విభాగం ప్రత్యేకాధికారి శ్రీ మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.