TTD EO INSPECTS SSD COUNTERS _ భ‌క్తుల‌కు వేగ వంతంగా టైంస్లాట్ టోకెన్లు జారీ_సర్వదర్శనం టోకెన్ కౌంటర్లను పరిశీలించిన టీటీడీ ఈవో

Tirupati, 23 April 2022: TTD EO Dr KS Jawahar Reddy has directed officials to prepare an action plan to speed up offline issue of Slotted Sarva Darshan tokens for the convenience of devotees.

 

During his inspection tour of the SSD counters at Tirupati along with Additional EO Sri AV Dharma Reddy, they were informed by the engineering officials about extensive arrangements made for the comfort of devotees like shelters, drinking water and changes in queue lines etc.

 

TTD EO and Additional EO visited the Bhudevi complex at Alipiri and later the counters at Srinivasam Rest House and Govindarajaswamy Choultries and made valuable suggestions to officials.

 

TTD JEO Sri Veerabrahmam, CVSO Sri Narasimha Kishore, SE(Electrical) Sri Venkateshwarlu, Additional CVSO Sri Shiva Kumar Reddy, IT head Sri Sesha Reddy, DSP Sri Murali Krishna and other engineering officials were present.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

భ‌క్తుల‌కు వేగ వంతంగా టైంస్లాట్ టోకెన్లు జారీ

సర్వదర్శనం టోకెన్ కౌంటర్లను పరిశీలించిన టీటీడీ ఈవో

తిరుపతి, 2022 ఏప్రిల్ 23: తిరుమ‌ల శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి విచ్చేసే భ‌క్తుల‌కు మ‌రింత వేగంగా, సౌక‌ర్యవంతంగా టైంస్లాట్ టోకెన్లు జారీ చేసేందుకు ప‌టిష్ట‌మైన కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక‌లు రూపొందిచాల‌ని టీటీడీ ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. తిరుపతిలోని సర్వదర్శనం టోకెన్ల జారీ కౌంటర్లను శ‌నివారం ఈవో, అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డితో క‌లిసి ప‌రిశీలించారు.

సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్ల విధానం పునరుద్ధరించాలని టీటీడీ యోచిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ కౌంటర్ల వద్ద భక్తుల సౌకర్యార్థం మరింత మెరుగ్గా చేపట్టాల్సిన ఏర్పాట్ల గురించి ఇంజినిరింగ్ అధికారులు ఈవో, అద‌న‌పు ఈవోల‌కు వివ‌రించారు. అన్నప్రసాదాలు అందించేందుకు, అవ‌స‌ర‌మైన చోట్ల షెల్ట‌ర్‌ల ఏర్పాటు, భక్తుల సౌక‌ర్యార్థం క్యూలైన్లలో మార్పులు త‌దిత‌ర అంశాల‌పై చ‌ర్చించారు.

ముందుగా అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్దగల కౌంటర్లను పరిశీలించారు. ఆ తరువాత శ్రీనివాసం యాత్రికుల వసతి సముదాయం, గోవిందరాజస్వామి సత్రాల వద్దగల కౌంటర్లను ఈవో పరిశీలించి, అధికారుల‌కు ప‌లు సూచ‌న‌లు చేశారు.

ఈవో వెంట జెఈవో శ్రీ వీర‌బ్ర‌హ్మం, సివిఎస్వో శ్రీ నరసింహ కిషోర్, ఎస్ఇ (ఎల‌క్ట్రిక‌ల్) శ్రీ వెంక‌టేశ్వ‌ర్లు, అద‌న‌పు సివిఎస్‌వో శ్రీ శివ‌కుమార్ రెడ్డి, ఐటి విభాగాధిపతి శ్రీ శేషారెడ్డి, విజిఓ శ్రీ మనోహర్, డిఎస్‌పి శ్రీ ముర‌ళీకృష్ణ‌ ఇతర ఇంజనీరింగ్ అధికారులు ఉన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.